Skip to main content

మోజ్ రీఫరల్ ఎఫ్ఏక్యూ

Last updated: 12th March 2021

మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి?

మోజ్ అనేది యూజర్ ఆహ్వాన కార్యక్రమం, దీనిని ఉపయోగించి మోజ్ యూజర్‌లు వారి స్నేహితులు మరియు కుటుంబసభ్యులను మోజ్ యాప్‌కు ఆహ్వానించడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు.

మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ ఉపయోగించి డబ్బు ఏవిధంగా సంపాదించాలి?

రివార్డులు 2 దశల్లో ఇవ్వబడతాయి. దశ 1 ఒక ఆహ్వానితుడు రీఫరల్ లింక్ ఉపయోగించి ఖాతాను ఇన్‌స్టాల్ చేసి, సృష్టించినప్పుడు. దశ 2 ఒక ఆహ్వానితుడు మోజ్ యాప్‌పై 30 నిమిషాల వాచ్ టైమ్ పూర్తి చేసినప్పుడు

నేను దశ 1 రివార్డులను ఎలా పొందగలను?

దశ 1లో, ఒక చెల్లుబాటు అయ్యే ఆహ్వానితుడు వారి అకౌంట్‌ని వెరిఫై చేసినప్పుడు, రీఫరర్ మరియు ఆహ్వానితుడు ఇద్దరూ రివార్డును పొందుతారు.

నేను దశ 2 రివార్డులను ఎలా పొందగలను?

స్టేజ్ 2లో, స్టేజ్ 1లో రివార్డ్ చేసిన చెల్లుబాటు అయ్యే ఆహ్వానితుడు, యాప్ ఇన్‌స్టాల్ చేసిన 7 రోజుల్లో 30 నిమిషాల వాచ్ టైమ్ పూర్తి చేసినప్పుడు, రీఫరర్ మరియు ఆహ్వానితులు ఇద్దరికి రివార్డులు ఇవ్వబడతాయి.

నేను సంపాదించిన రివార్డులను నేను ఎలా రీడిమ్ చేసుకోవాలి?

సంపాదించిన రివార్డులను రీడిమ్ చేసుకోవడానికి మీరు బ్యాంక్ అకౌంట్ జోడించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రీడిమ్ కోసం మేం మరిన్ని విధానాలను జోడిస్తాం.

నా స్నేహితులు వారి ఫోన్‌లపై రివార్డుల ప్రోగ్రామ్‌ని చూడలేదు. ఎందుకు?

మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ కేవలం అర్హత కలిగిన కొంత మంది యూజర్‌లకు మాత్రమే తెరవబడుతుంది. అలాగే, ఈ ప్రోగ్రామ్ మోజ్ ఆండ్రాయిడ్ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

నేను ఒక స్నేహితుడిని రిఫర్ చేశాను, అతడు ఫేస్‌బుక్ ఉపయోగించి తన ఖాతాను ధృవీకరించాడు, కానీ నాకు ఇంకా ఎలాంటి రివార్డు రాలేదు. ఎందుకు?

రివార్డులకు అర్హత పొందడానికి ఆహ్వానితులు ఫోన్ నెంబరు లేదా ట్రూకాలర్ ఉపయోగించి తమ ఖాతాను ధృవీకరించాల్సి ఉంటుంది.

నేను ఒక స్నేహితుడిని రిఫర్ చేశాడు, అతడు తన అకౌంట్‌ని ధృవీకరించాడు కానీ, నేను 2వ దశ రివార్డును ఇంకా పొందలేదు. ఎందుకు?

2వ దశ రివార్డ్ కొరకు ఆహ్వానితులు యాప్ ఇన్‌స్టాల్ చేసిన మొదటి 7 రోజుల్లోగా 30 నిమిషాల వీడియో వాచ్ సమయాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

పారలల్ స్పేస్ వంటి యాప్‌లను నేను ఉపయోగించవచ్చా?

లేదు, క్లోన్ యాప్‌లు, ఎమ్యులేటర్‌లు మరియు రూటెడ్ పరికరాలకు రివార్డుల ప్రోగ్రామ్ కొరకు అర్హత ఉండదు. అటువంటి యాప్‌లు ఉపయోగించడం వల్ల మీరు జీవితకాలం నిషేధించబడవచ్చు.

మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ నిబంధనలు & మార్గదర్శకాలు#

మోజ్ రీఫరల్ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు దయచేసి దిగువ నిబంధనలను చదవండి. పాల్గొనడం ద్వారా, మీరు దిగువ పేర్కొన్న అన్ని నిబంధనలను చదివి అంగీకరించినట్లుగా మీరు ధృవీకరిస్తున్నారు.

  1. మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ యూజర్‌లకు రెండు దశల్లో రివార్డులను అందిస్తుంది:
    • దశ 1 రివార్డ్: ఒక రీఫెరర్ విజయవంతంగా ఒక కొత్త యూజర్ (ఆహ్వానితుడు)ని ఆహ్వానించిన ప్రతిసారి మరియు ఆహ్వానితుడు ఒక ఖాతాను సృష్టించినప్పుడు, రీఫరర్ మరియు ఆహ్వానితుడు ఇద్దరూ రూ. 2 చొప్పున సంపాదిస్తారు.
    • దశ 2 రివార్డ్: స్టేజ్ 1 రివార్డ్ అందుకున్న ఆహ్వానితుడు, యాప్ ఇన్‌స్టాల్ చేసిన మొదటి 7 రోజుల్లోగా ఫర్ యు ఫీడ్‌లో 30 నిమిషాల వీడియోలను విజయవంతంగా చూసినప్పుడు, రీఫరర్ మరియు ఆహ్వానితులు ఇద్దరూ రూ.5 చొప్పున సంపాదిస్తారు
  2. కొత్త యూజర్ మొదటిసారి వారి పరికరాలపై మోజ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న ఆహ్వానితుడిని తెలియజేస్తుంది.
  3. కొత్త యూజర్ మోజ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని యాప్‌పై అకౌంట్‌ సృష్టించినప్పుడు అది విజయవంతమైన రీఫరల్’.
  4. పరిమితులు: ప్రోగ్రామ్ సమయంలో, ప్రతి యూజర్ 10 మంది వరకు కొత్త యూజర్‌లను ఆహ్వానించవచ్చు.
  5. ఆహ్వానితుడు యాప్‌ని విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసి యాప్‌కు లాగిన్ అయినప్పుడు, అదే యూజర్‌ని తిరిగి ఆహ్వానించడం వర్తించదు మేం కొత్త యూజర్‌లను రిజిస్టర్డ్ ఫోన్ నెంబరు, పరికర సమాచారం మరియు ఇతర యూజర్ సంబంధిత సమాచారం ప్రకారంగా గుర్తిస్తాం
  6. రిడంప్షన్
    • ఒక యూజర్ కేవలం ఒక్క బ్యాంక్ అకౌంట్‌ని మాత్రమే వారి ప్రొఫైల్‌కచు లింక్ చేయవచ్చు.
    • యూజర్ వారి రివార్డ్‌ని రీడిమ్ చేసుకోవడానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉపయోగించినప్పుడు, అదే బ్యాంక్ అకౌంట్‌ ఏవరైనా మరో యూజర్ ద్వారా ఉపయోగించలేరు.
    • మీ రివార్డ్ రీడిమ్ చేసుకోవడానికి ముందు దయచేసి మీ బ్యాంక్ అకౌంట్‌ వివరాలను ధృవీకరించండి. తప్పుడు బ్యాంక్ వివరాలు అందించినందుకు మోజ్ బాధ్యత వహించదు.
  7. అనర్హతకు ప్రమాణాలు:
    • రీఫరల్ కార్యక్రమంలో పాల్గొనడానికి వర్చువల్ ఫోన్ నెంబర్‌లు అనుమతించబడవు
    • యాప్ యాక్టివిటీకి అంతరాయం కలిగించడం లేదా సవరించడం కొరకు ఎమిలేటర్‌లు వంటి తృతీయపక్ష టూల్స్ ఉపయోగించడం పూర్తిగా నిషేధించబడింది.
    • ఫ్లాట్‌ఫారంపై అనుమానిత మోసపూరిత కార్యకలాపాలతో యూజర్‌లను నిషేధించే హక్కు మోజ్ యాప్‌కు దఖలు పడి ఉంటుంది.
  8. మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ మోజ్ ఆండ్రాయిడ్ యాప్ మీద మాత్రమే లభ్యమవుతుంది. మోజ్ ఐవోఎస్ యాప్ మరియు మోజ్ లైట్ యాప్‌పై ఇన్‌స్టలేషన్‌లకు రీఫరల్ రివార్డుల కొరకు అర్హత ఉండదు

ఈ ఈవెంట్‌కు మోజ్ యాప్ యొక్క నిబంధనలు & గోప్యత మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు వర్తిస్తాయి.

మరింత సమాచారం కొరకు, దయచేసి మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ నియమనిబంధనలు మరియు ఎఫ్ఏక్యూ రిఫర్ చేయండి.