మోజ్ వినియోగ నిబంధనలు
Last updated: 12th August 2024
ఈ ఉపయోగ నిబంధనలు ("నిబంధనలు") మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన "ప్లాట్‌ఫారమ్"గా సూచించబడే మా మొబైల్ అప్లికేషన్ మరియు దాని వెర్షన్‌లు(“యాప్”) యొక్క మీ వినియోగాన్ని నియంత్రిస్తాయి. ("MTPL", "కంపెనీ", "మేము", "మాకు" మరియు "మా"), ఈ ప్రైవేట్ కంపెనీ భారతదేశ చట్టాల ప్రకారం స్థాపించబడింది మరియు కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్, సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ, బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103.
మా సేవలు (దిగువ వివరించిన విధంగా) మరియు ఈ నిబంధనలు భారతీయ శిక్షాస్మృతి, 1860 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000, దీనిలో చేసిన అన్ని సవరణలు మరియు దాని కింద రూపొందించిన నిబంధనలతో సహా వాటికి అనుగుణంగా రూపొందించబడ్డాయి. మీరు మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించేటప్పుడు, మీరు ఈ నిబంధనలను ఆమోదిస్తారు మరియు అంగీకరిస్తారు. అయితే, మేం భారతదేశం కాకుండా ఏదైనా దేశం యొక్క చట్టాలను మేం పాటిస్తామని తెలియజేయడం లేదని దయచేసి గమనించండి. మీరు మా సేవలను ఉపయోగించాలని కోరుకున్నట్లయితే, దయచేసి మీ న్యాయపరిధిలో ఆ విధంగా చేయడానికి అనుమతించబడినట్లుగా దయచేసి ధృవీకరించండి.
మీరు మా ఫ్లాట్‌ఫారం ఉపయోగించేటప్పుడు దిగువ నిర్ధిష్ట నిబంధనుల మీరు మరియు మేం అనుసరించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలను మేం ఈ డాక్యుమెంట్‌లో జాబితా చేశాం. దయచేసి ఇక్కడ పేర్కొన్న ఈ నిబంధనలను మరియు ఇతర అన్ని హైపర్‌లింక్‌లను జాగ్రత్తగా చదవండి. మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నిబంధనలకు అంగీకరిస్తున్నట్లుగా గుర్తుంచుకోండి. అలానే, మీరు భారతదేశానికి వెలుపల ఈ సేవలను ఉపయోగిస్తున్నట్లయితే, దయచేసి మీ స్థానిక చట్టాలను పాటించండి.
#
నిబంధనలు మరియు సేవలకు మార్పులుమా ఫ్లాట్‌ఫారం డైనమిక్ స్వభావం కలిగినది మరియు వేగంగా మారుతుండవచ్చు. అందువల్ల, మా విచక్షణ మేరకు మేం అందించే సేవలను మేం మార్చవచ్చు. మేం మీకు సాధారణంగా అందించే సేవలు లేదా ఫీచర్‌లను తాత్కాలికంగా, లేదా శాశ్వతంగా, అందించడాన్ని ఆపివేయవచ్చు.
మేము మా ఫ్లాట్‌ఫారం మరియు సేవలకు ఎటువంటి నోటీస్ లేకుండా ఫంక్షనాలిటీలను తీసివేయవచ్చు లేదా జోడించవచ్చు. అయితే, మీ సమ్మతి అవసరమైనచోట మేం మార్పులు చేసినప్పుడు, మేం దాని కొరకు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతాం. మా తాజా మార్పులు మరియు పరిణామాలపై ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటానికి దయచేసి ఈ పేజీని సందర్శించడాన్ని ధృవీకరించుకోండి.
మేము చేసే ఏవైనా మార్పులు మరియు మేం జోడించగల లేదా సవరించగల సేవలను, నియతానుసారంగా చూసేందుకు ఈ పేజీని సందర్శించండి.
#
మా సేవలుమా సేవల్ని మీకు అందించేందుకు మేం అంగీకరిస్తున్నాం. ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క అన్ని ఉత్పత్తులు, ఫీచర్‌లు, అప్లికేషన్‌లు, సేవలు, టెక్నాలజీలు మరియు మేం మీకు అందించే సాఫ్ట్‌వేర్‌లు అన్నీ కూడా ఈ సర్వీస్‌ల్లో చేర్చబడతాయి. సేవల్లో దిగువ అంశాలు పొందుపరచబడ్డాయి (సేవలు):
మా ప్లాట్‌ఫారం యూజర్‌లు ఏవైనా ఫోటోగ్రాఫ్‌లు, యూజర్ వీడియోలు, సౌండ్ రికార్డింగ్‌లు మరియు దానిలో పొందుపరచబడ్డ మ్యూజికల్ వర్క్‌లు, మీ వ్యక్తిగత మ్యూజిక్ లైబ్రరీ మరియు పరిసర చప్పుడు ("యూజర్ కంటెంట్") నుంచి స్థానికంగా నిల్వ చేయబడ్డ సౌండ్ రికార్డింగ్ లను చేర్చే వీడియోలతో సహా ఎలాంటి పరిమితులు లేకుండా, ఫ్లాట్‌ఫారం ద్వారా కంటెంట్ అప్‌లోడ్ లేదా పోస్ట్ చేయడం లేదా మరోవిధంగా లభ్యం అయ్యేలా చేయడానికి మా ఫ్లాట్‌ఫారం అనుమతిస్తుంది. ("యూజర్ కంటెంట్").
మీరు ఫ్లాట్‌ఫారంపై ఏదైనా యూజర్ కంటెంట్‌ని పబ్లిష్ చేసినప్పుడు, దాని ప్రారంభించినప్పుడు ఆ కంటెంట్‌లో మీకు ఎటువంటి యాజమాన్యత హక్కులు ఉంటాయో అవే మీకు ఉంటాయి. అయితే, ఆ కంటెంట్ ఉపయోగించుకునేందుకు మీరు మాకు లైసెన్స్ మంజూరు చేస్తున్నారు.
అటువంటి యూజర్ కంటెంట్‌ని పరిమిత వ్యక్తిగత లేదా వాణిజ్యేతర ఉపయోగానికి పంచుకోవడం లేదా కమ్యూనికేట్ చేసే హక్కును కూడా మీరు ఇతర యూజర్‌లకు మంజూరు చేస్తున్నారు.
ఏదైనా యూజర్ కంటెంట్ గోప్యమైనది కానిదిగా పరిగణించబడుతుంది. మీరు గోప్యమైనదిగా భావించే లేదా తృతీయపక్షాలకు చెందిన లేదా వర్తించే చట్టాలను ఉల్లంఘిస్తుందని భావించే ఏదైనా యూజర్ కంంటె్‌ని సర్వీస్‌లపైన లేదా ద్వారా పోస్ట్ చేయరాదు లేదా మాకు ప్రసారం చేయరాదు. సర్వీస్‌ల నుంచి దాని తృతీయపక్ష ఫ్లాట్‌ఫారాలకు ప్రసారం చేయడానికి, మరియు/లేదా ఏదైనా తృతీయపక్ష కంటెంట్ స్వీకరించడానికి మీరు సర్వీస్‌ల ద్వారా యూజర్ కంటెంట్‌ని సబ్మిట్ చేసినప్పుడు, మీరు ఆ యూజర్ కంటెంట్ మీ స్వంతం అని, లేదా సర్వీస్‌లకు సబ్మిట్ చేయబడే కంటెంట్ యొక్క ఏదైనా భాగం యజమాని ద్వారా అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు, లేదా అధికారాన్ని మీరు పొందినట్లుగా మీరు అంగీకరిస్తున్నారు మరియు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీకు ఒక సౌండ్ రికార్డింగ్‌పైన మాత్రమే హక్కులు ఉండి, అటువంటి సౌండ్ రికార్డింగ్‌లో పొందుపరిచిన అంతర్లీన సంగీత రచనలకు లేనట్లయితే, అప్పుడు సర్వీస్‌లకు సబ్మిట్ చేసే కంటెంట్ యొక్క ఏదైనా భాగం యజమాని నుంచి మీరు అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు లేదా అధికారం ఉంటే తప్ప సర్వీస్‌లకు అటువంటి ధ్వని రికార్డింగ్‌లను మీరు పోస్ట్ చేయరాదు. మీరు మాకు ప్రపంచవ్యాప్త, రాయల్టీ-ఫ్రీ, సబ్ లైసెన్సబుల్ మరియు బదిలీ చేయగల లైసెన్స్‌ను హోస్ట్ చేయడానికి, నిల్వ చేయడానికి, ఉపయోగించడానికి, ప్రదర్శించడానికి, పునరుత్పత్తి చేయడానికి, సవరించడానికి, స్వీకరించడానికి, ఎడిట్ చేయడానికి, ప్రచురించడానికి మరియు పంపిణీ చేయడానికి ఒక ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను మంజూరు చేశారు. ఈ లైసెన్స్ సేవలను ఆపరేట్ చేయడం, అభివృద్ధి చేయడం, అందించడం, ప్రోత్సహించడం మరియు మెరుగుపరచడం మరియు కొత్తవి పరిశోధించడం మరియు అభివృద్ధి చేయడం వంటి పరిమిత ప్రయోజనం కొరకు ఉద్దేశించబడింది. ఏదైనా రూపంలో మరియు ఏదైనా/అన్ని మీడియా లేదా పంపిణీ విధానాల్లో (ప్రస్తుతం తెలిసిన లేదా తరువాత అభివృద్ధి చేయబడే) నుంచి, ప్రమోట్ చేయడం, ఎగ్జిబిట్, బ్రాడ్‌కాస్ట్, సిండికేట్, పబ్లిక్‌గా ప్రదర్శించడానికి మరియు బహిరంగంగా డిస్‌ప్లే చేయడానికి కూడా మీరు శాశ్వత లైసెన్స్‌ని మంజూరు చేస్తారు.
సాధ్యమైనంత మేరకు, మీరు యూజర్ కంటెంట్‌లో కనిపించినప్పుడు, సృష్టించేటప్పుడు, అప్‌లోడ్ చేయడం, పోస్ట్ చేయడం లేదా పంపడం ద్వారా, వాణిజ్య లేదా ప్రాయోజిత కంటెంట్‌తో సహా మీ పేరు, పోలిక మరియు స్వరాన్ని ఉపయోగించడానికి మీరు మాకు అనియంత్రిత, ప్రపంచవ్యాప్త, శాశ్వత హక్కు మరియు లైసెన్స్‌ని మంజూరు చేయాలి. అంటే, ఇతర విషయాలతోపాటుగా, మీ డేటా మార్కెటింగ్, ప్రకటన లేదా మా సేవలను మెరుగుపరచడానికి మా ద్వారా ఉపయోగించినట్లయితే, మీరు ఎలాంటి నష్టపరిహారాన్ని పొందలేరు.
మేం ఆవిధంగా చేయాల్సిన అవసరం లేనప్పటికీ, సేవలను అందించడం మరియు అభివృద్ధి చేయడం లేదా మీ కంటెంట్ ఈ నిబంధనలను అదేవిధంగా వర్తించే చట్టాల ద్వారా తప్పనిసరి చేయబడ్డ ఉద్దేశ్యాల కోసం మీ కంటెంట్ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తుందని మేం భావిస్తే, మేం ఏ సమయంలోనైనా మరియు ఏ కారణం చేతనైనా మీ కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు, సమీక్షించవచ్చు, స్క్రీన్ చేయవచ్చు మరియు తొలగించవచ్చు. అయితే, మీరు సృష్టించే, అప్‌లోడ్ చేసే, పోస్ట్ చేసే, పంపే లేదా సేవ ద్వారా నిల్వ చేసే కంటెంట్‌కు మీరు మాత్రమే బాధ్యత వహిస్తారు.
ఈ నిబంధనల్లో లేదా మాతో మీరు ప్రవేశించిన మరో ఒప్పందం ప్రకారంగా మా ద్వారా ప్రత్యేకంగా అనుమతించినట్లయితే మినహా, ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, ప్రమోషన్‌లు, డేటా వినియోగం ద్వారా అయితే దానికే పరిమితం కాకుండా, సేవల మీ ఉపయోగం నుంచి ప్రకటనలు అమ్మడం, స్పాన్సర్‌షిప్‌లు, ప్రమోషన్‌లు, వినియోగ డేటా ద్వారా మేం ఆదాయాలు జనరేట్ చేయవచ్చు, పేరుప్రఖ్యాతులు పెంచుకోవచ్చు లేదా మరోవిధంగా మా విలువను పెంచుకోవచ్చని, అటువంటి రెవిన్యూ, గుడ్‌విల్ లేదా విలువను పంచుకునేందుకు మీకు ఎలాంటి హక్కు లేదని మీరు తదుపరి ఒప్పుకుంటున్నారు మరియు అంగీకరిస్తున్నారు.
ఈ నిబంధనల్లో లేదా మాతో మీరు కుదుర్చుకున్న ఏదైనా ఇతర ఒప్పందం లో మీరు ప్రత్యేకంగా అనుమతించినవిధంగా మినహా, మీ ద్వారా సృష్టించిన ఏదైనా యూజర్ కంటెంట్‌తో సహా మీరు ప్లాట్‌ఫారంపై పబ్లిష్ చేసే ఏదైనా కంటెంట్ నుంచి లేదా ఏదైనా మ్యూజికల్ వర్క్‌లు, సౌండ్ రికార్డింగ్ లు లేదా ఆడియో విజువల్ క్లిప్‌లను మీరు ఉపయోగించుకోవడం ద్వారా లేదా సేవల ద్వారా మీకు లభ్యం అయ్యే ఏదైనా కంటెంట్ నుంచి ఎలాంటి ఆదాయం లేదా ఇతర పరిగణనను పొందే హక్కు లేదని మీరు తదుపరి ఒప్పుకుంటున్నారు.
మీరు ఒక మ్యూజికల్ వర్క్ కంపోజర్ లేదా రచయిత అయితే మరియు ఒక ప్రదర్శన హక్కుల సంస్థకు అఫిలియేట్‌గా ఉంటే, అప్పుడు మీరు మా వద్ద ఉన్న మీ యూజర్ కంటెంట్‌లో ఈ నిబంధనల ద్వారా మీరు మంజూరు చేసే రాయల్టీ-ఫ్రీ లైసెన్స్‌ని మీ ప్రదర్శన హక్కుల సంస్థకు మీరు విధిగా పేర్కొనాలి. సంబంధిత ప్రదర్శన హక్కుల ఆర్గనైజేషన్ రిపోర్ట్ బాధ్యతలను మీరు పాటించేట్లుగా చూడాల్సిన పూర్తి బాధ్యత మీపై ఉంటుంది. మీరు ఒక సంగీత పబ్లిషర్‌కు మీ హక్కులను అసైన్ చేసినట్లయితే, అప్పుడు మీరు మీ యూజర్ కంటెంట్‌లో ఈ నిబంధనల్లో పేర్కొన్న రాయల్టీ-ఫ్రీ లైసెన్స్(లు) మంజూరు చేయడానికి లేదా అటువంటి సంగీత పబ్లిషర్ మాతో ఈ నిబంధనల్లో ప్రవేశించేందుకు అటువంటి సంగీత పబ్లిషర్ నుండి మీరు విధిగా అనుమతిని పొందాలి.
ఒక సంగీత రచన (ఉదా. ఒక పాట రాయడం) చేయడం ఈ నిబంధనల్లో మాకు లైసెన్సులు మంజూరు చేసే హక్కు మీకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మీరు ఒక రికార్డింగ్ లేబుల్ యొక్క రికార్డింగ్ ఆర్టిస్ట్ అయితే, మీ లేబుల్ ద్వారా క్లెయిం చేసుకునే సర్వీస్‌ల ద్వారా మీరు ఏవైనా కొత్త రికార్డులను సృష్టించడంతో సహా, మీ రికార్డింగ్ లేబుల్‌తో మీకు ఉండగల ఏవైనా కాంట్రాక్ట్ బాధ్యతలకు అనుగుణంగా మీ సేవల ఉపయోగం ఉన్నట్లుగా ధృవీకరించుకోవాల్సిన పూర్తి బాధ్యత మీపై ఉంటుంది.
మా సేవలను అధ్యయనం చేయడానికి మరియు మా సేవలను మెరుగుపరచడానికి మరియు మా కమ్యూనిటీ శ్రేయస్సుకు దోహదపడేందుకు పరిశోధనా ఉద్దేశ్యాల కొరకు తృతీయపక్షాలతో మా సేవలు అధ్యయనం చేయడానికి మరియు సహకారం నెరపడానికి మా వద్ద ఉన్న సమాచారాన్ని మేం ఉపయోగిస్తాం.
#
మా సేవల్ని ఎవరు ఉపయోగించవచ్చుమా ఫ్లాట్‌ఫారం మీ స్నేహితులు మరియు కుటుంబంతో అందుబాటులో ఉండటానికి, వీడియోలు మరియు సంగీతాన్ని పంచుకోవడానికి మీకు సాయపడుతుంది. మీ ప్రాధాన్యత కంటెంట్‌ని మేం అర్ధం చేసుకుంటాం మరియు దానికి అనుగుణంగా ఎవరైనా వ్యక్తి జోక్యం లేకుండా ఆటోమేటెడ్ రీతిలో మా ఫ్లాట్‌ఫారంపై లభ్యమయ్యే కంటెంట్‌ని సూచిస్తాం ("సర్వీస్/సర్వీస్‌లు").
మీరు మాతో ఒప్పందం కుదుర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటే మరియు చట్టబద్ధంగా మా సేవలను ఉపయోగించేందుకు అనుమతించబడితేనే మీరు మా సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఈ నిబంధనలను ఒక కంపెనీ లేదా ఎవరైనా చట్టపరమైన వ్యక్తుల నుంచి ఆమోదిస్తున్నట్లయితే, అప్పుడు మీరు ఈ నిబంధనలకు అటువంటి సంస్థను అనుబంధీకరించే అధికారం మీకు ఉందని మీరు సూచిస్తారు, సమర్ధిస్తారు మరియు "మీరు" మరియు "మీ యొక్క" అనేది కంపెనీని రిఫర్ చేస్తుంది.
వర్తించే చట్టాల కింద మా సేవలను ఉపయోగించేందుకు మీకు అధికారం ఉందని దయచేసి ధృవీకరించండి.
#
మా సేవల్ని ఎలా ఉపయోగించాలిమా సేవని ఉపయోగించడానికి, మీ మొబైల్ ఫోన్‌పై మొబైల్ అప్లికేషన్‌ని రన్ చేసి, సేవలను రన్ చేయాలని మీరు కోరుకునే ప్రాంతీయ భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు మీ మొబైల్ నంబర్ ఉపయోగించి లేదా మీ ఆపిల్ ఐడి, ఫేస్బుక్ లేదా మీ గూగుల్ ఐడి వంటి మూడవ పార్టీ సేవల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించడానికి మేము ఇతర మూడవ పార్టీ సేవలను జోడించవచ్చు. మీ ఫోన్ నంబర్‌కు SMS ద్వారా మేము పంపిన వన్-టైమ్-పాస్‌వర్డ్ ఉపయోగించి కూడా మీరే ధృవీకరించవచ్చు. మా ఫ్లాట్‌ఫారంపై లభ్యమయ్యే కంటెంట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవడానికి మరియ మీ అనుభవాన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారంలు అంతటా పంచుకునేందుకు కూడా మేం మిమ్మల్ని అనుమతిస్తాం.
మీకు సేవల్ని అందించడానికి, మేం మీ మొబైల్ పరికరంపై నిర్ధిష్ట ఫీచర్‌లను యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది.
#
మోజ్ సెలెక్ట్ప్లాట్ఫారమ్లోని అన్ని ‘మోజ్ సెలెక్ట్ క్రియేటర్స్’, అనగా మా భాగస్వామి సృష్టికర్తలు నల్ల అంచుతో గుర్తించబడతారు (వారి ప్రొఫైల్ చిత్రంలో ప్రామాణిక తెల్ల సరిహద్దుకు బదులుగా). అటువంటి మోజ్ సెలెక్ట్ క్రియేటర్స్‌తో మేము కంటెంట్ లైసెన్స్ లేదా మార్కెటింగ్ ఏర్పాట్లలోకి ప్రవేశించవచ్చు.
#
సమ్మతి అవసరాలుసంబంధిత వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ పబ్లిషర్లు వారి వినియోగదారు ఖాతాల వివరాలను నిబంధనల ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లోని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు అందించాలి.
#
భద్రతమేం ఒక సానుకూల మరియు చేకూర్పు కలిగిన కమ్యూనిటీ పెంపొందించడం మరియు మా యూజర్‌లు అందరికి కూడా అద్భుతమైన సామాజిక అనుభవాలను అందించాలనేది మా లక్ష్యం. దీని కొరకు, మీరు వీటిని అంగీకరించాల్సి ఉంటుంది:
- మీరు చట్టవ్యతిరేకమైన లేదా ఈ నిబంధనల్లో నిషేధించబడ్డ ఏదైనా ఉద్దేశ్యం కొరకు సేవల్ని ఉపయోగించరాదు.
- మీరు సేవలను యాక్సెస్ చేసుకోవడానికి లేదా ఇతర యూజర్‌ల సమాచారాన్ని వెలికితీయడానికి ఏదైనా రోబోట్, స్పైడర్, క్రాయిలర్, స్క్రాపర్, లేదా ఇతర ఆటోమేటెడ్ విధానాలను ఉపయోగించరాదు.
- మీరు సేవలు లేదా ఇతర యూజర్‌ల కంటెంట్ లేదా రాతపూర్వక సమ్మతి లేకుండా సమాచారంతో ఇంటరాక్ట్ అయ్యేవిధంగా ఏవైనా తృతీయపక్ష అనువర్తనాలను ఉపయోగించడం లేదా అభివృద్ధి చేయరాదు.
- మీరు సేవలను పూర్తి ఆస్వాదించకుండా అంతరాయం, విఘాతం, వ్యతిరేక ప్రభావం, లేదా నిరోధించే రీతిలో లేదా సేవల పనితీరును నష్టం కలిగించే, నిలిపివేసే, అధికార భారం మోపే, లేదా వైకల్యం చెందించే రీతిలో సేవలను ఉపయోగించరాదు.
- ఏదైనా తృతీయపక్షం యొక్క ఏదైనా మేధోపరమైన ఆస్తి హక్కు ఉల్లంఘనగా భావించే ఏదైనా కంటెంట్‌ని మీరు పోస్ట్ చేయరాదు.
- మా సేవలను ఉపయోగించడానికి మిమ్మల్ని మీరు మరో వ్యక్తి లేదా మరో వ్యక్తి యొక్క ప్రతినిధిగా మిమ్మల్ని మీరు తప్పుగా పేర్కొనరాదు.
- మీరు అనుమతి లేకుండా మరో యూజర్ ఖాతా, యూజర్‌నేమ్, లేదా పాస్‌వర్డ్ ఉపయోగించడం లేదా ఉపయోగించడానికి ప్రయత్నించరాదు.
- మీరు మరో యూజర్ నుంచి లాగిన్ క్రెడెన్షియల్స్ కొరకు బేరసారాలు చేయరాదు.
- మీరు మైనర్‌లకు హానికరంగా భావించే ఏదైనా కంటెంట్‌ని పోస్ట్ చేయరాదు. దీనికి సంబంధించి దయచేసి కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను దయచేసి రిఫర్ చేయండి.
- పోర్నోగ్రఫీ, గ్రాఫిక్ హింస, బెదిరింపులు, ద్వేషపూరిత ప్రసంగం, లేదా హింసకు ప్రేరేపించేవి కలిగి ఉన్న కంటెంట్‌ని మీరు పోస్ట్ చేయరాదు.
- వైరస్‌లు లేదా ఇతర మోసపూరిైన కోడ్ లేదా సేవల భద్రతకు మరోవిధంగా విఘాతం కలిగించేవి మీరు అప్‌లోడ్ చేయరాదు.
- మేం ఉపయోగించే ఏదైనా కంటెంట్ ఫిల్టరింగ్ టెక్నిక్‌ను దాటవేయడానికి, లేదా మీరు యాక్సెస్ చేసుకునేందుకు అధికారం లేని ప్రాంతాలు లేదా సేవల ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించరాదు.
- మీరు మా సేవలు లేదా ఏదైనా సిస్టమ్ లేదా నెట్‌వర్క్ బేధ్యతను శోధించడం, స్కాన్ చేయడం, లేదా పరీక్షించరాదు.
- భారతదేశ ఐక్యత, సమైక్యత, రక్షణ, భద్రత లేదా సార్వభౌమత్వాన్ని, విదేశీ ప్రభుత్వాలతో స్నేహపూర్వక సంబంధాలు, లేదా బహిరంగ ఉత్తర్వు లేదా ఏ అపరాధమైన నేరం చేసేట్లుగా ప్రేరేపించడం లేదా ఏదైనా నేరాన్ని విచారించడాన్ని నిరోధించడం లేదా ఏదైనా ఇతర దేశాన్ని అవమానపరిచే విధంగా మీరు ఏదైనా మార్గంలో లేదా రూపంలో ఏదైనా కంటెంట్‌ని పోస్ట్ చేయలేరు.
- మీరు ఈ నిబంధనలను ఉల్లంఘించే ఏదైనా కార్యకలాపాన్ని ప్రోత్సహించడం లేదా ప్రమోట్ చేయరాదు.
- మా ద్వారా అమలు చేసిననా ఫీచర్, యాక్షన్, కొలత లేదా పాలసీని మీరు తప్పించుకోరాదు. ఉదాహరణకు, మీరు సేవల్ని ఉపయోగించడం నుంచి నిషేధించినట్లయితే, మీకు విరుద్ధంగా తీసుకునే ఏదైనా అకౌంట్ సస్పెన్షన్ లేదా ఇదేవిధమైన చర్యల నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నించరాదు.
#
గోప్యతా విధానంగోప్యతా విధానం సమాచారాన్ని మేం ఏవిధంగా సేకరిస్తాం, ఉపయోగిస్తాం, ప్రాసెస్ చేస్తాం, పంచుకుంటాం మరియు నిల్వ చేస్తాం అనే విషయాన్ని వివరిస్తుంది. గోప్యతా విధానం చట్టం కింద మీ హక్కులు మరియు మీరు మాకు అందించే డేటాను మీరు ఎలా నియంత్రించవచ్చు అనే వివరాలను కూడా అందిస్తుంది.
ఈ సమాచారాన్ని మేం ఏవిధంగా భద్రపరుస్తాం మరియు ఉపయోగిస్తాం అనేది గోప్యతా విధానం లో వివరించబడింది.
ప్రైవసీ పాలసీ ప్రకారం, మేము ప్లాట్‌ఫామ్‌లో థర్డ్ పార్టీ పొందుపరచడం మరియు సేవలను కూడా ఉపయోగించవచ్చు. అటువంటి API సేవలు మరియు పొందుపరిచిన వినియోగం అటువంటి థర్డ్ పార్టీ సేవల విధానాల ద్వారా కవర్ చేయబడుతుంది. అటువంటి పొందుపరిచిన లేదా API సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు ఇక్కడ అందించిన థర్డ్ పార్టీ యొక్క సేవా నిబంధనలకు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు.
#
మీ కట్టుబాట్లువైవిధ్యభరితమైన కమ్యూనిటీ కొరకు ఒక సురక్షితమైన మరియు భద్రమైన సర్వీస్ అందించడానికి, మనమందరం మన వంతుగా పనిచేయాల్సి ఉంటుంది. మా సేవలను అందించడానికి మా నిబద్ధతకు ప్రతిగా, మీరు మాకు కొన్ని వాగ్ధానాలు చేయాలని మేం కోరుతున్నాం. దిగువ పేర్కొన్న వాగ్ధానాలతో పాటుగా ఫ్లాట్ ఫారంపై మీరు తీసుకునే ఏవైనా చర్యల( ఈ నిబంధనల ఉల్లంఘనతో సహా)కు అయ్యే ఖర్చులు మరియు పర్యవసానాలను మీరు పూర్తిగా భరిస్తారనే విషయాన్ని దయచేసి గమనించండి. మా సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు దిగువ పేర్కొన్నవాటిని అంగీకరిస్తున్నారు మరియు ఆమోదిస్తున్నారు:
#
a. ఎలాంటి తప్పుడు సమాచారాన్ని అందించరాదుమా సేవలను ఉపయోగించడానికి మీరు మిమ్మల్ని మరొక వ్యక్తిగా లేదా మరొక వ్యక్తి యొక్క ప్రతినిధిగా తప్పుగా సూచించరాదు . మేము మీ ప్రొఫైల్‌ను తొలగించవచ్చు లేదా నిలిపివేయవచ్చు లేదా మీరు మాకు తప్పు సమాచారాన్ని అందిస్తే ఇతర సంబంధిత చర్యలు తీసుకోవచ్చు.
#
b. పరికరం భద్రతమా ఫ్లాట్‌ఫారం సురక్షితమైనదని ధృవీకరించడానికి మేం చర్యల్ని అమలు చేశాం. అయితే, హ్యాకింగ్ మరియు వైరస్ ఎటాక్‌ల నుంచి మా ఫ్లాట్‌ఫారం సురక్షితమైనదనే దానికి ఎలాంటి గ్యారెంటీ లేదు. మీ మొబైల్ పరికరం మరియు కంప్యూటర్‌లో భద్రతను ధృవీకరించడానికి యాంటీ మాల్‌వేర్ మరియు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ని కలిగి ఉన్నట్లుగా మీరు ధృవీకరిస్తారు.
మా సేవల యొక్క మీ ఉపయోగాన్ని సురక్షితం చేయడానికి మేం సాధ్యమైనది ప్రతిదీ చేసినప్పటికీ, మా ఫ్లాట్‌ఫారంపై అన్నిరకాలైన దాడుల గురించి మేం ఆలోచించలేం అని గుర్తుపెట్టుకోండి. మీరు, మీ మొబైల్ పరికరం మరియు కంప్యూటర్ ని ఏవిధంగానూ తప్పుగా ఉపయోగించకుండా లేదా తారుమారు చేయలేదని ధృవీకరించుకోవాలి.
#
c. కంటెంట్ తొలగించడం మరియు రద్దు చేయడంఈ ప్లాట్‌ఫారమ్ లో మీ వినియోగం మా కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల ద్వారా నిర్వహించబడుతుంది. మా వినియోగదారులలో ఎవరైనా మీ కంటెంటును ఇతర కంటెంట్ కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నట్లు నివేదించినట్లయితే, మేము మా ప్లాట్‌ఫారమ్ నుండి అలాంటి కంటెంట్‌ను తీసివేయవచ్చు. కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలు ఉల్లంఘించిన దానికి సంబంధించి అనేకసార్లు నివేదించిన సందర్భంలో, మా వద్ద మీ అకౌంట్ తొలగించాలని మేం బలవంతం చేయవచ్చు మరియు మాతో రిజిస్టర్ చేసుకోకుండా మిమ్మల్ని బ్లాక్ చేయవచ్చు. ఏదైనా అటువంటి తొలగింపును మీరు అప్పీల్ చేయాలని కోరుకున్నట్లయితే, మీరు grievance@sharechat.co కు రాయవచ్చు.
అటువంటి కంటెంట్ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలుకింద నిషేధించబడినట్లయితే మా ఫ్లాట్‌ఫారంపై పంచుకోబడ్డ ఏదైనా కంటెంట్‌ని మేం తొలగించవచ్చు..
#
d. ఫ్లాట్‌ఫారాన్ని ఏదైనా చట్టవ్యతిరేక లేదా అక్రమ కార్యక్రమాలకు ఉపయోగించరాదుమా ప్లాట్‌ఫారం అనేక భాషలు మరియు సంస్కృతులు, అదేవిధంగా విభిన్న రకాల కంటెంట్ కలిగి ఉండేవిధంగా డిజైన్ చేయబడింది.s. ఈ మేరకు, కంటెంట్ స్వభావాన్ని వర్గీకరించడానికి మేం వివిధ రకాలైన ట్యాగ్‌లను అభివృద్ధి చేశాం.
అందువల్ల, మీరు పంచుకునే కంటెంట్ స్వభావాన్ని మీరు సరిగ్గా గుర్తించి, దానికి తగిన విధంగా ట్యాగ్ చేయాలి.
అయితే, మీరు అశ్లీలమైన, పోర్నోగ్రఫిక్, మైనర్‌లకు హాని కలిగించే, వివక్ష, ద్వేష ప్రసంగంగా పరిగణించబడే వాటిని వ్యాప్తి చేయడం, ఏదైనా వ్యక్తిపై హింస లేదా ద్వేషాన్ని ప్రేరేపించడం లేదా భారతదేశంలోని ఏదైనా చట్టాలను ఉల్లంఘించడం లేదా ఏదైనా భారతీయ చట్టాల ద్వారా పంచుకోవడం నిషేధించబడ్డ వాటి కొరకు ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించరాం. అటువంటి కంటెంట్‌ని తొలగించే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది. తదుపరి సమాచారం కొరకు దయచేసి కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను చదవండి.
పైన దానికి అదనంగా, ప్రభుత్వ సంస్థలు లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ఏవైనా చట్టపరమైన బాధ్యత లేదా ఏదైనా ప్రభుత్వ అభ్యర్ధనను పాటించేందుకు; లేదా, మా ఖాతాదారులు లేదా పబ్లిక్ ఆస్తి లేదా భద్రతకు హానిని నిరోధించడం లేదా హక్కులను సంరక్షించడం; లేదా ప్రజాభద్రత, మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడం, నిరోధించడం లేదా మరోవిధంగా పరిష్కరించడానికి మీ వ్యక్తిగత డేటా లేదా సమాచారాన్ని పంచుకునేందుకు సహేతుకంగా అవసరం అని మాకు మంచి విశ్వాసం ఉన్నట్లయితే మీ సమాచారాన్ని చట్టాన్ని అమలు చేసే సంస్థలతో పంచుకోవచ్చు అని దయచేసి గమనించండి. మా ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించడం ద్వారా తృతీయపక్షం లేదా యూజర్ ద్వారా చేయబడ్డ లేదా మీకు చేయబడ్డ ఏదైనా చర్యలకు మేం బాధ్యత వహించలేమని మీరు అర్థం చేసుకుంటారు.
అద్భుతమైన సామాజిక అనుభవాల్లో నిమగ్నం కావడం కొరకు మేం ఒక ఫ్లాట్‌ఫారాన్నిఅభివృద్ధి చేస్తాం, దయచేసి చట్టవ్యతిరేకమైన లేదా సొసైటీ లేదా కమ్యూనిటీ సభ్యుల శ్రేయస్సుకు ఎలాంటి హాని కలిగించే కంటెంట్‌ని పంచుకోవద్దు.
#
e. కంటెంట్ హక్కులు మరియు బాధ్యతలుమేం భావవ్యక్తీకరణ స్వేచ్ఛను బలంగా విశ్వసిస్తాం మరియు మా ఫ్లాట్‌ఫారంపై వీడియోలను పంచుకునేందుకు అనుమతిస్తాం. మీరు పంచుకునే కంటెంట్‌పై మాకు ఎలాంటి యాజమాన్యత ఉండదు మరియు కంటెంట్‌లోని హక్కులు మీ వద్ద మాత్రమే ఉంటాయి. మా లేదా ఏదైనా తృతీయపక్ష మేధోపరమైన ఆస్తి హక్కుల్ని ఉల్లంఘించడం లేదా ఉల్లంఘించడానికి మీరు మా ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించరు. అటువంటి కంటెంట్ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంటుంది మరియు ఫ్లాట్‌ఫారం నుంచి తొలగించవచ్చు. తదుపరి, మీరు మా ద్వారా అభివృద్ధి చెందించిన ఏదైనా కంటెంట్‌ని ఉపయోగించినట్లయితే, అప్పుడు అటువంటి కంటెంట్లో ఉండే మేధోపరమైన ఆస్తి హక్కులను మేం స్వంత చేసుకోవడం కొనసాగిస్తాం.
మా సేవలను ఉపయోగించి కంటెంట్‌ను భాగస్వామ్యం చేయడం/పోస్ట్ చేయడం/అప్‌లోడ్ చేయడం ద్వారా, మీరు మాకు (మరియు మా గ్రూప్ మరియు అనుబంధ సంస్థలకు) హోస్ట్ చేయడానికి, ఉపయోగించడానికి, పంపిణీ చేయడానికి, అమలు చేయడానికి, కాపీ చేయడానికి, ప్రదర్శించడానికి ప్రత్యేకమైన, రాయల్టీ రహిత, బదిలీ చేయదగిన, ఉప-లైసెన్సు పొందిన, ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను మంజూరు చేస్తారు సేవలను అందించడం, అప్‌గ్రేడ్ చేయడం లేదా మెరుగుపరచడం, మార్కెటింగ్ చేయడం, మిమ్మల్ని/సేవలను ప్రోత్సహించడం లేదా అందుబాటులో ఉన్న ఏదైనా సేవలో మీ కంటెంట్‌ను ప్రదర్శించడం వంటి ప్రయోజనాల కోసం మీ కంటెంట్ (మీ గోప్యత మరియు అప్లికేషన్ సెట్టింగ్‌లకు అనుగుణంగా) ను అనువదించండి లేదా రూపొందించండి. మీరు మీ కంటెంట్ మరియు/లేదా అకౌంట్ను ఏ సమయంలోనైనా తొలగించవచ్చు లేదా మా డేటా నిలుపుదల విధానాల ప్రకారం మీ కంటెంట్/అకౌంట్ తొలగించబడవచ్చు దీని ఫలితంగా మీ వినియోగదారు కంటెంట్ అటువంటి ఇతర వేరియంట్‌ల నుండి కూడా తొలగించబడుతుంది. అయితే, మీ కంటెంట్ ఇతరులతో షేర్ చేయబడినట్లయితే ప్లాట్‌ఫారమ్‌లో కనిపించడం కొనసాగించవచ్చు. అంతేకాకుండా, మేము మీ వినియోగదారు కంటెంట్‌ను మరియు ఇతర డేటాను పరిమిత వ్యవధిలో ఉంచుకోవచ్చు, తద్వారా మీ అకౌంట్ను పునరుద్ధరించడానికి మీరు ఎంచుకుంటే, మీరు ప్రారంభించిన అకౌంట్ తొలగింపు సందర్భంలో మాత్రమే మీ అకౌంట్ను పునరుద్ధరించవచ్చు. మేము సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము మరియు మీ కంటెంట్‌ను ఎలా నియంత్రించాలి లేదా తొలగించాలి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి MOJ గోప్యతా విధానం మరియు అకౌంట్ తొలగింపుపై తరచుగా అడిగే ప్రశ్నలను చదవండి.
మా ఫ్లాట్‌ఫారంపై మీరు పోస్ట్ చేసే కంటెంట్‌కు మీరే పూర్తిగా బాధ్యత వహిస్తారు. మా ప్లాట్‌ఫారంపై లేదా మా ప్లాట్‌ఫారం ద్వారా పంచుకున్న లేదా పోస్ట్ చేసిన కంటెంట్‌కు మరియు అటువంటి పంచుకోవడం లేదా పోస్ట్ చేయడం ఫలితంగా చోటు చేసుకునే ఏవైనా పరిణామాలకు మేం ఎలాంటి ఎండార్స్ చేయం మరియు బాధ్యత వహించం. మీ ద్వారా పంచుకోబడ్డ ఏదైనా కంటెంట్‌పై మా లోగో లేదా ఏదైనా ట్రేడ్‌మార్క్ ఉండటం అంటే మీ కంటెంట్‌ని మేం ఎండార్స్ లేదా స్పాన్సర్ చేసినట్లు అర్ధం కాదు. తదుపరి, ప్లాట్‌ఫారంపై ప్లాట్‌ఫారం లేదా ప్రకటనదారులతో మీ ద్వారా చేసిన లేదా ప్రవేశించిన ఏదైనా లావాదేవీల పరిణామాలకు మేం లయబిలిటీ కాదు లేదా బాధ్యత వహించం.
మీరు పంచుకునే కంటెంట్ కొరకు మీకు ఎప్పుడూ యాజమాన్యత మరియు బాధ్యత ఉంటాయి. మీ కంటెంట్‌పై మేధోపరమైన ఆస్తి హక్కులు ఉన్నట్లుగా మేం ఎన్నడూ క్లెయిం చేయం, అయితే, మా ప్లాట్‌ఫారంపై మీరు పంచుకునే చేసే మరియు పోస్ట్ చేసే దానిని ఉపయోగించడానికి మాకు ఒక ఎలాంటి ఖర్చు లేని, శాశ్వత లైసెన్స్ ఉంటుంది.
#
f. మధ్యవర్తి స్థితి మరియు ఎలాంటి బాధ్యత లేదుమేం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000 మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియేటరీ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు, 2021 కింద మేం మధ్యవర్తిగా ఉన్నాం. ఈ నిబంధనలు మా ప్లాట్‌ఫారం యాక్సెస్ చేసుకోవడానికి మరియు ఉపయోగించడానికి గోప్యతా విధానం మరియు ఉపయోగ నిబంధనల యొక్క నియమనిబంధనలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియేటరీ మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా నైతిక నియమావళి) రూల్స్, 2021 యొక్క రూల్ 3(1) నిబంధనలకు అనుగుణంగా ప్రచురించబడతాయి. మీరు మరియు ఇతర యూజర్‌లు సృష్టించిన లేదా పంచుకున్న కంటెంట్‌ని అప్‌లోడ్ చేయడం, పంచుకోవడం మరియు ప్రదర్శించడానికి యూజర్‌లకు ఒక ఫ్లాట్‌ఫారాన్ని అందించడానికే మా పాత్ర పరిమితం చేయబడుతుంది.
ఫ్లాట్‌పారంపై మీరు లేదా ఇతర వ్యక్తి ఏమి చేయవచ్చు లేదా ఏమి చేయరాదనేది మేం నియంత్రించం, అటువంటి చర్యలు (ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ అయినా) కొరకు మేం ఎలాంటి బాధ్యత వహించం. మీరు మా సర్వీస్‌ల ద్వారా వాటిని యాక్సెస్ చేసినప్పటికీ ఇతరులు అందించే సర్వీస్‌లు మరియు ఫీచర్‌లకు మేం బాధ్యత వహించం. మా ఫ్లాట్‌ఫారంపై జరిగే దేని కొరకు అయినా మా బాధ్యత, ఖచ్చితంగా భారతదేశం యొక్క చట్టాల ద్వారా పరిపాలించబడుతుంది మరియు ఆమేరకు పరిమితం చేయబడుతుంది. మీకు లేదాఈ నిబంధనలకు సంబంధించిన ఏదైనా ఇతర వ్యక్తికి కలిగే లాభనష్టాలకు, ఆదాయాలు, సమాచారం లేదా డేటా, లేదా పర్యవసాన, ప్రత్యేక, పరోక్ష, ఆదర్శవంతమైన, శిక్షాత్మక, లేదా ఘటనాత్మక నష్టాలు సాధ్యం అని మాకు తెలిసినప్పటికీ కూడా మేం బాధ్యత వహించం అని మీరు అంగీకరిస్తున్నారు. ఇది మీ కంటెంట్, సమాచారం, లేదా అకౌంట్‌ని మేం డిలీట్ చేసినప్పుడు కూడా జోడించబడుతుంది.
మేం భారతీయ చట్టాల కింద ఒక మధ్యవర్తి. మా ఫ్లాట్‌ఫారంపై వ్యక్తులు పోస్ట్ చేసే దానిని మేం నియంత్రించం, అయితే ప్రతి ఒక్కరూ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను పాటించాలని మేం ఆశిస్తున్నాం.
#
g. మీరు యాప్ సర్వీస్‌లకు విఘాతం లేదా అపాయం కలిగించరాదుమేం కమ్యూనిటీ ఆధారిత ప్లాట్‌ఫారాన్ని అభివృద్ధి చేశాం. అందువల్ల, మా ప్లాట్‌ఫారం, సర్వీస్ మరియు మా టెక్నికల్ డెలివరీ సిస్టమ్ యొక్క పబ్లిక్ కాని ప్రాంతాల్లో జోక్యం చేసుకోవడం, లేదా ఉపయోగించరాదని మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఎటువంటి ట్రోజన్‌లు, వైరస్‌లు, ఏదైనా ఇతర హానికరమైన సాఫ్ట్‌వేర్, ఏవైనా బోట్‌లు లేదా ఏదైనా యూజర్ సమాచారం కొరకు మా ప్లాట్‌ఫారాన్ని స్క్రాప్ చేయరాదు. అదనంగా, మా ద్వారా అమలు చేసిన సిస్టమ్, సెక్యూరిటీ లేదా ప్రమాణీకరణాన్ని మీరు శోధించరాదు, స్కాన్ చేయరాదు, లేదా ప్రమాదాలను టెస్ట్ చేయరాదు. మా సాంకేతిక డిజైన్ మరియు ఆర్కిటెక్చర్‌ని మీరు తారుమారు చేయడం లేదా తారుమారు చేసినట్లుగా ప్రయత్నించినట్లయితే, మేం మీ యూజర్ ప్రొఫైల్‌ని తొలగిస్తాం మరియు మా సర్వీస్‌లు ఉపయోగించడం నుంచి మిమ్మల్ని నిషేధిస్తాం. మేం అటువంటి చర్యలు చట్టాన్ని అమలు చేసే తగిన అధికారులకు నివేదించవచ్చు మరియు మీకు విరుద్ధంగా చట్టపరమైన చర్యలు చేపట్టవచ్చు.
మీరు మా ప్లాట్‌ఫారానికి ఏ విధమైన హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను హ్యాక్ చేయడం లేదా పరిచయం చేయడం చేయరాదు. మీరు అటువంటి చర్యలకు పాల్పడితే మీరు ఫ్లాట్‌పారం నుంచి తొలగించబడవచ్చు మరియు మీ చర్యలు పోలీస్ మరియు/లేదా సంబంధిత చట్టపరమైన అధికారులకు నివేదించవచ్చు.
#
మీరు మాకు ఇచ్చే అనుమతులుమీరు ఈ నిబంధనలను ఆమోదించి, మాకు కొన్ని అనుమతులు ఇస్తారు, తద్వారా మేం మీకు మరింత మెరుగ్గా సేవలందించగలుగుతాం. మీరు మాకు మంజూరు చేసే అనుమతులు:
#
a. మీ ప్రొఫైల్ సమాచారాన్ని తృతీయపక్షాలతో పంచుకునేందుకు అనుమతిమా ఫ్లాట్‌ఫారం స్వేచ్ఛగా యాక్సెస్ చేసుకొని మరియు ఉపయోగించే ఫ్లాట్‌ఫారం కనుక, మేం రెవిన్యూ జనరేట్ చేయాల్సి ఉంటుంది, అందువల్ల మేం మా సేవల్ని మీకు ఉచితంగా అందించడాన్ని కొనసాగించగలుగుతాం. దీనికి అనుగుణంగా, మీకు ఏదైనా ప్రాయోజిత కంటెంట్ లేదా ప్రకటనలు చూపించడానికి మీ యూజర్ నేమ్, ప్రొఫైల్ చిత్రాలు, మా ఫ్లాట్‌ఫారంపై మీ ఉపయోగం మరియు నిమగ్నత అలవాట్లు మరియు ప్యాట్రన్‌లతో సహా అయితే వాటికి పరిమితం కాకుండా మా ప్లాట్‌ఫారమ్‌పై మేం సేకరించగల ఏదైనా డేటాను మేం పంచుకోవచ్చు. మీకు ఎడ్వర్టైజ్ చేసిన ఏదైనా ప్రొడక్ట్‌లను మీరు కొనుగోలు చేసినట్లయితే, మీకు రెవిన్యూ వాటాని చెల్లించడానికి మేం బాధ్యత వహించం. మేం ఎలాంటి ప్రొడక్ట్‌లను ఎండార్స్ చేయం లేదా ప్రొడక్ట్‌ల ప్రామాణికతకు వాగ్ధానం చేయం. మా ప్లాట్‌ఫారంపై యూజర్‌ల ద్వారా ఉత్పత్తుల ప్రకటనలు ఇవ్వడం అనేది మా ద్వారా ఎండార్స్ చేసినట్లుగా కాదు.
మేం ఏదైనా సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నట్లయితే (వర్తించే చట్టాల కింద నిర్వచించిన విధంగా) మేం పంచుకోవడానికి ముందు మీ సమ్మతి కొరకు మిమ్మల్ని అడుగుతాం.
#
b. ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌లు మరియు అప్డేట్లుమేం మా ఫ్లాట్‌ఫారం మరియు అందించే సేవలను నిరంతరం అప్‌డేట్ చేస్తూ ఉంటాం. మా ఫ్లాట్‌ఫారం ఉపయోగించడానికి, మీ మొబైల్ పరికరంపై మొబైల్ అప్లికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని, నియతానుసారంగా దానిని అప్‌డేట్ చేయాల్సి రావొచ్చు.
అప్లికేషన్‌లు మరియు సాఫ్ట్‌వేర్ మీ ఉపయోగం కొరకు నిరంతరం అప్‌డేట్ చేయబడుతుంది మరియు అటువంటి అప్‌డేట్ జనరేట్ అయిన ప్రతిసారి మీ మొబైల్ పరికరానికి మొబైల్ అప్లికేషన్ యొక్క తాజా వెర్షన్‌ని మీరు ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.
#
c. కుకీలు ఉపయోగించడానికి అనుమతితృతీయపక్ష వెబ్‌సైట్‌ల మీ ఉపయోగానికి సంబంధించి సమాచారాన్ని సేకరించడానికి మరియు నిల్వ చేయడానికి మేం కుకీలు, పిక్సెల్ ట్యాగ్‌లు, వెబ్ బీకాన్‌లు, మొబైల్ పరికరం ఐడిలు, ఫ్లాష్ కుకీలు మరియు అదే విధమైన ఫైల్స్ లేదా టెక్నాలజీ సేవలను ఉపయోగించవచ్చు.
#
d. డేటాని నిలిపి ఉంచడంఫ్లాట్ఫారాన్ని మీ ఉపయోగించడానికి సంబంధించి నిర్ధిష్ట సమాచారాన్ని అట్టిపెట్టే హక్కు మాకు ఉంటుంది. మా ద్వారా మీ సమాచారం సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ చేయడం మరియు ఉపయోగానికి గురించి తదుపరి సమాచారం కొరకు దయచేసి గోప్యతా విధానాన్ని వీక్షించండి.
మీకు సంబంధించిన మరియు మీ ద్వారా అందించబడ్డ సమాచారాన్ని నిల్వ చేయడం, ప్రాసెస్ చేయడం మరియు ఉంచుకునేందుకు మీరు మాకు హక్కుని మంజూరు చేస్తున్నారు. తదుపరి సమాచారం కొరకు దయచేసి గోప్యతా విధానాన్ని చూడండి.
#
మోజ్ లైవ్#
లైవ్ ఫీచర్ కోసం పూర్తి వివరాలు:ఫ్లాట్‌ఫామ్‌లో మీ అంతట మీరు రియల్ టైమ్ వీడియోలను బ్రాడ్‌కాస్ట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే ఫీచర్‌ని("లైవ్ స్ట్రీమ్") మేం అందిస్తున్నాం. లైవ్‌స్ట్రీమ్ ఉపయోగించి మీ ద్వారా అప్‌లోడ్ చేయబడే మొత్తం కంటెంట్ మా యొక్క నిర్ణీత సేవా నిబంధనలను ధృవీకరించాలి మరియ కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలకు లోబడి ఉండాలి.ఏదైనా లైవ్‌స్ట్రీమ్‌ని వెంటనే తొలగించే లేదా సస్పెండ్ చేసే మరియు సముచితంగా భావించేటువంటి ఇతర చర్యలను తీసుకునే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది.
ఒకవేళ మీకు విరుద్ధంగా అటువంటి తొలగింపు/రద్దు చేయడం/సస్పెండ్ చేయడం వంటి చర్యలను తీసుకున్నట్లయితే, మీరు ‘ఉల్లంఘనలు’ (ఫ్లాట్‌ఫారంపై హెల్స్ & సపోర్ట్ ట్యాబ్‌లో) పేజీ కింద ఇన్ యాప్ అప్పీల్స్ యంత్రాంగాన్ని యాక్సెస్ చేసుకోవడం ద్వారా అప్పీల్ చేసుకోవచ్చు లేదా support@sharechat.co ద్వారా మాకు మెయిల్ పంపవచ్చు.
దయచేసి తదుపరి రిఫరెన్స్ కొరకు వద్ద ఉన్నటువంటి కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు ఇతర పాలసీలను గమనించండి.
ఈ ఫీచర్ ద్వారా మీ ఫాలోవర్లు మరియు ఇతర మోజ్ యాప్ యూజర్‌లు మిమ్మల్ని సంప్రదించవచ్చు మరియు మీ ద్వారా బ్రాడ్‌కాస్ట్ చేసిన లైవ్‌స్ట్రీమ్‌పై వ్యాఖ్యానించవచ్చు. మేం నియతానుసారంగా లైవ్‌స్ట్రీమ్ విధులను జోడించవచ్చు, తొలగించవచ్చు, లేదా మార్పు చేయవచ్చు. లైవ్‌స్ట్రీమ్ అనేది మా ఫ్లాట్‌ఫారంపై ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న ఫీచర్, నియతానుసారంగా లైవ్‌స్ట్రీమ్ ఫీచర్ యొక్క ప్రస్తుతం ఫీచర్‌లను మేం జోడించవచ్చు/తొలగించవచ్చు లేదా సవరించవచ్చు. మేం ఇలా పేర్కొంటూ, ఎలాంటి గ్యారెంటీని ఇవ్వము:
a. లైవ్ స్ట్రీమ్ ఫీచర్‌లో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవు , ఈ ఫీచర్ మీ ఉపయోగం కొరకు అందుబాటులో ఉంటుంది b. లైవ్‌స్ట్రీమ్ యొక్క అన్ని ఫీచర్‌లు కూడా అన్నివేళలా లభ్యమవుతాయి c. లైవ్‌స్ట్రీమ్ ఫీచర్ ఉపయోగించి ఇతర యూజర్‌ల ద్వారా పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్ ఖచ్చితంగా ఉంటుంది.
అయితే కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాల కింద నిషేధించబడ్డ కంటెంట్‌ని అప్‌లోడ్ చేయడానికి మీరు ఈ ఫీచర్‌ని దుర్వినియోగం చేయలేరు. మీకు అవసరమైన హక్కులున్న, మరియు తృతీయపక్షాలకు చెందిన కాపీరైట్ లేదా ఏదైనా మేథోసంపత్తి హక్కులను ఉల్లంఘించని కంటెంట్‌ని మాత్రమే లైవ్‌స్ట్రీమ్‌లో్ ప్రసారమయ్యేలా మేం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. తృతీయపక్ష మేథోపరమైన సంపత్తి హక్కును ఉల్లంఘించగల కాపీరైటెడ్ మ్యూజిక్ ఉండే కంటెంట్ లైవ్ స్ట్రీమ్ చేయడం లేదా అప్‌లోడ్ అనేది మా కంటెంట్ మరియు కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించడమే అవుతుంది.
ఫ్లాట్‌ఫారంపై రక్షణ మరియు భద్రత కొరకు ప్రస్తుత యూజర్‌ల ద్వారా హోస్ట్ చేసే లైవ్‌స్ట్రీమ్ కొరకు మేం వ్యాఖ్యలను నిలిపివేయవచ్చు.
#
ప్రాయోజిత/ప్రమోట్ చేసిన కంటెంట్:మా కమ్యూనిటీ మార్గదర్శకాలు మరియు ఇతర వర్తించే చట్టాలకు అదనంగా, మీరు లైవ్‌స్ట్రీమ్‌పై ఏదైనా కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నా లేదా స్పాన్సర్ చేస్తున్నా, దయచేసి దిగువ పేర్కొన్నవాటిని ఎలాంటి పరిమితులు లేకుండా అనుసరించేలా ధృవీకరించుకోండి:
a. ఏదైనా ప్రాయోజిత/ప్రమోట్ చేసిన కంటెంట్ గురించి మీరు యూజర్‌లకు అప్లికేషన్ ద్వారా లేదా మరోవిధంగా తెలియజేయాలి(లైవ్‌స్ట్రీమ్‌లో లభ్యం అవుతున్న 'పెయిడ్ ప్రమోషన్' ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా) b. లైవ్‌స్ట్రీమ్‌పై కంటెంట్‌కు సంబంధించి మీరు ఏదైనా తప్పు దోవ పట్టించే/సరిగ్గా లేని ప్రకటనలను ప్రసారం చేయరాదు c. మీరు ఏదైనా హానికరమైన/చట్టవ్యతిరేక వస్తువులు మరియు సేవలను ప్రమోట్ చేయరాదు.
ఏదైనా ప్రాయోజిత కంటెంట్ కొరకు మీ చట్టపరమైన బాధ్యతలను అర్థం చేసుకోవడానికి దయచేసి డిజిటల్ మీడియాలో ప్రభావశీల ప్రకటనల కొరకు ASCI మార్గదర్శకాలను చూడండి మరియు మీ ప్రకటనదారుని సంప్రదించండి.
#
నివేదించే చర్యలు:ఒక బాధ్యతాయుతమైన యూజర్‌గా ఈ ఫీచర్‌కు వర్తించే చట్టాలు, కమ్యూనిటీ మార్గదర్శకాలు, నిబంధనలు ఉల్లంఘించవచ్చు అని మీ దృష్టికి వచ్చే ఏదైనా లైవ్‌స్ట్రీమ్ లేదా అటువంటి లైవ్‌స్ట్రీమ్‌పై వ్యాఖ్యలను దయచేసి మాకు తెలియచేయండి. ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా, ఫ్లాట్‌పారంపై ఉండే ప్రతి ఒక్కరికి సురక్షితమైన మరియు మెరుగైన అనుభవం లభించేలా చర్యలు తీసుకోబడతాయి. లైవ్‌స్ట్రీమ్‌లో అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన వ్యాఖ్యను మరియు/లేదా లైవ్‌స్ట్రీమ్‌నురిపోర్ట్ చేయడానికి మీరు ఇన్-యాప్ రిపోర్టింగ్ యంత్రాంగాన్ని ఉపయోగించవచ్చు. మీరు అటువంటి ఉల్లంఘనలను ఇమెయిల్ ద్వారా support@sharechat.coకు పంపవచ్చు.
వర్తించే చట్టాలు మరియు నిబంధనలను పాటించడానికి, అదేవిధంగా ఘటన పరిశోధన ఉద్దేశ్యాల కొరకు మీ లైవ్‌స్ట్రీమ్‌ని రికార్డ్ చేసి ఇరవై ఒక్క (21) రోజులపాటు తాత్కాలికంగా మేము భద్రపరుస్తామని దయచేసి గమనించండి. లైవ్‌స్ట్రీమ్‌పై ఎలాంటి రిపోర్ట్‌లు లేనట్లయితే ఇరవై ఒక్క (21) రోజుల కాలవ్యవధి పూర్తయిన తరువాత ఈ రికార్డ్‌లను మేం డిలీట్ చేయవచ్చు.అయితే, చట్టపరమైన అధికారులు మరియు చట్టాన్ని అమలు చేసే యంత్రాంగాలకు సహకరించడం కొరకు వాటిని మరింత ఎక్కువ కాలం నిల్వ చేయాల్సి రావొచ్చు.
#
మా ఒప్పందం మరియు మనం అంగీకరించపోతే ఏమి జరుగుతుంది#
a. ఈ నిబంధనల కింద ఎవరికి హక్కు ఉందిఈ నిబంధనల కింద మీకు హక్కులు మరియు బాధ్యతలు మీకు మాత్రమే మంజూరు చేయబడతాయి మరియు మా సమ్మతి లేకుండా ఏ తృతీయపక్షానికి అసైన్ చేయలేరు. అయితే, ఈ నిబంధనల కింద మా హక్కులు, బాధ్యతలను ఇతరులకు అసైన్ చేసేందుకు మేం అనుమతించబడతాం. ఇది ఎప్పుడు జరగుతుంది అంటే, ఉదాహరణకు, మేం వేరే కంపెనీతో విలీనమైనప్పుడు మరియు ఒక కొత్త కంపెనీ సృష్టించినప్పుడు.
#
b. మేం వివాదాలను ఏవిధంగా పరిష్కరిస్తాంఅన్ని సందర్భాల్లో, వివాదాలు భారతదేశ చట్టాలకు లోబడి ఉంటాయని, అటువంటి అన్ని వివాదాలపై బెంగళూరు న్యాయస్థానాలకు ప్రత్యేక న్యాయ పరిధి ఉంటుందని మీరు అంగీకరిస్తున్నారు.
#
అనుసరిస్తున్న గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజంమా యూజర్స్ యొక్క గోప్యత మరియు భద్రతకు పూర్తి రక్షణ కల్పించేందుకు మేము నిబద్ధతతో పని చేస్తున్నాం. ఇందులో భాగంగా మా యూజర్స్‌ను సురక్షితంగా ఉంచడానికి మేము ప్రభుత్వ అధికారులతో కలిసి నిరంతరం పని చేస్తున్నాం. మేము ఒక గ్రీవెన్స్ ఆఫీసర్‌ని నియమించాము, ప్లాట్‌ఫారమ్‌లో వారి అనుభవం గురించి వినియోగదారుకు ఆందోళన ఉంటే నేరుగా సంప్రదించవచ్చు. ప్లాట్‌ఫారమ్‌కు సంబంధించి మీరు లేవనెత్తిన ఏవైనా ఆందోళనలు లేదా ఫిర్యాదులను పరిష్కరించడంలో సహాయపడటానికి మేము బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేసాము.
#
ఫిర్యాదుల పరిష్కారం కోసం వివిధ విధానాలు కింద ఇవ్వబడ్డాయి:మీరు యూజర్ ప్రొఫైల్‌లను నివేదించవచ్చు మరియు మా కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించే కంటెంట్‌పై ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదును సమర్పించాల్సిన యూజర్ ప్రొఫైల్ పక్కన అందుబాటులో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయడం ద్వారా మీరు యూజర్ ప్రొఫైల్‌ను నివేదించవచ్చు. మీరు తగిన కారణాన్ని ఎంపిక చేసి, నివేదిక ఎంపికపై క్లిక్ చేయవచ్చు. మీరు దాని కోసం నివేదికను సమర్పించడానికి బాణం చిహ్నం (వీడియోకి కుడి వైపున ఉన్న)పై క్లిక్ చేయడం ద్వారా వీడియోను నివేదించవచ్చు. మీరు కామెంట్స్‌ను ఓపెన్ చేసి, దానిని నివేదించడానికి కామెంట్‌ను ప్రెస్ చేసి పట్టుకుని కుడా నివేదించవచ్చు. ప్రొఫైల్ సెట్టింగ్‌ల ట్యాబ్‌పై అందుబాటులో ఉన్ననివేదికల పేజ్‌లో ప్రతి ఫిర్యాదు స్టేటస్‌ని చెక్ చేయవచ్చు. మీరు ప్రొఫైల్ సెట్టింగ్‌ల ట్యాబ్ దగ్గర అందుబాటులో ఉన్న సహాయం & మద్దతు ఎంపిక ద్వారా కూడా సమస్యను తెలియపరచవచ్చు.
మీపై ఫిర్యాదు చేసినట్లయితే లేదా మీరు అప్‌లోడ్ చేసిన ఏదైనా కంటెంట్ ఉంటే, మీరు ప్రొఫైల్ సెట్టింగ్‌ల ట్యాబ్ దగ్గర అందుబాటులో ఉన్న ఉల్లంఘనల పేజ్‌లో పూర్తి వివరాలను చూడవచ్చు. వాటికి సంబంధించిన విషయంపై అప్పీలు(పూర్తి వివరాలతో కూడిన నివేదన) చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు మరియు ఉల్లంఘనల పేజ్‌లో మీ అప్పీలను ధృవీకరించడానికి కామెంట్స్ జోడించవచ్చు.
మీరు https://support.sharechat.com/లో అందుబాటులో ఉంచిన చాట్‌బాట్ మెకానిజం ద్వారా కూడా మీ ఫిర్యాదును నివేదించవచ్చు.
మీరు మీ ఆందోళన లేదా ఫిర్యాదును contact@sharechat.co మరియు grievance@sharechat.co కి ఇమెయిల్ ద్వారా సెండ్ చేసి తెలియపరచవచ్చు.
ఆటో-జనరేటెడ్ పద్దతిలో మీరు ఒక టిక్కెట్ నంబర్‌ను రిసీవ్ చేసుకుంటారు మరియు ఫిర్యాదు లేదా ఆందోళనపై సంబంధిత చర్యలను ప్లాట్‌ఫార్మ్ విధానాలు మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తీసుకోబడతాయి.
యూజర్స్ కోసం ఏర్పాటు చేసిన https://help.mojapp.in/transparency-report లో అందుబాటులో ఉన్న మా నెలవారీ పారదర్శకత నివేదికలో తీసుకున్న చర్యల యొక్క వివరాలు క్రోడీకరించి అందించబడ్డాయి.
కింద చూపిన పాలసీలకు సంబంధించి లేదా మీకు ఏవైనా ఇతర ఆందోళనలకు సంబంధించి మీరు గ్రీవెన్స్ అధికారిని కూడా సంప్రదించవచ్చు:
A. సేవా నిబంధనలు
B. గోప్యతా విధానం
C. మీ అకౌంట్‌కు సంబంధించిన ప్రశ్నలు
యూజర్స్ డేటా భద్రత, గోప్యత మరియు ప్లాట్‌ఫార్మ్ వినియోగ సమస్యలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక గ్రీవెన్స్ అధికారిని మీ సేవలకై నియమించాం. మీ సమస్యలను రిజిస్టర్ చేసిన 15 (పదిహేను) రోజుల్లోగా మేము పరిష్కరిస్తాం. మీరు మమ్మల్ని సంప్రదించడానికి మరియు మీ సమస్యలను పరిష్కరించడానికి మేము ఒక పద్ధతిని ఏర్పాటు చేశాము.
మీరు కింది ఏ గ్రీవెన్స్ అధికారినైనా సంప్రదించవచ్చు:
Ms. హర్లీన్ సేథి
చిరునామా: మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్,
నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్,
సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ,
బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103.
ఇమెయిల్: grievance@sharechat.co
గమనిక - మేము ఫిర్యాదులను వేగవంతంగా ప్రాసెస్ చేయడానికి మరియు పరిష్కరించేందుకు, దయచేసి పైన పేర్కొన్న ఇమెయిల్ IDకి మీ యూజర్ సంబంధిత ఫిర్యాదులను పంపగలరు
నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ - Ms. హర్లీన్ సేథి
ఇమెయిల్: nodalofficer@sharechat.co
గమనిక - ఈ ఇమెయిల్ పూర్తిగా పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల ఉపయోగం కోసం మాత్రమే ఏర్పాటు చేసింది. కాబట్టి యూజర్ సంబంధిత సమస్యలకు ఇది సరైన ఇమెయిల్ ID కాదు. అన్ని యూజర్ సంబంధిత ఫిర్యాదుల కోసం, దయచేసి మమ్మల్ని grievance@sharechat.co వద్ద సంప్రదించండి.
#
పరిమిత బాధ్యతఏదైనా తప్పుడు లేదా అసంపూర్ణమైన సమాచారం లేదా ఫ్లాట్‌ఫారం యొక్క ఎవరైనా యూజర్ యొక్క చర్యల వల్ల ఏదైనా వారెంటీ లేదా గ్యారెంటీ యొక్క ఉల్లంఘన వల్ల ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉత్పన్నమయ్యే ఏదైనా నష్టం లేదా డ్యామేజీకి సంబంధించి మేం ఎలాంటి బాధ్యత వహించం.
ప్లాట్‌ఫారం మరియు సేవలు రాతపూర్వకంగా పేర్కొన్నప్పుడు మినహా ఎలాంటి ప్రాతినిధ్యం లేదా వారెంటీలు, సాదృశ్యత లేదా అంతర్నిహిత, లేకుండా "ఎలా ఉందో" మరియు "అందుబాటులో ఉన్న" ప్రాతిపదికన అందించబడతాయి. అంతరాయం లేకుండా, సకాలంలో, సురక్షితంగా లేదా దోషరహితంగా, ఏదైనా పరికరంపై నిరంతరం అనుకూలంగా ఉండేవిధంగా, లేదా ఏదైనా దోషాలను సరిచేయడంతో సహా సేవల నాణ్యత లేదా ప్లాట్‌ఫారానికి మేం హామీ ఇవ్వం.
ఎవరైనా యూజర్ ద్వారా నిబంధనల ఉల్లంఘన లేదా సేవలు లేదా ఫ్లాట్‌ఫారంపై ఆధారపడటం వల్ల ఉత్పన్నమయ్యే పర్యావసానం వలే కలిగే ఏదైనా ప్రత్యేక, ఘటనాత్మక, శిక్షాత్మక, ప్రత్యక్ష, పరోక్ష లేదా పర్యవసాన నష్టాలకు ఏ సందర్భంలోనూ మేం లేదా మా అఫిలియేట్‌లు, వారసులు, మరియు అసైన్‌లు, మరియు వారి సంబంధిత ఇన్వెస్టర్‌లు, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్‌లు, సర్వీస్ ప్రొవైడర్‌లు మరియు సరఫరాదారులు బాధ్యత వహించరు.
ఇందులో ఉన్న ఏదైనా మినహాయింపు ఏదైనా కారణం వల్ల చెల్లుబాటు కాకుండా నిలిపివేయడం మరియు ఏదైనా కారణం వల్ల మేం లేదా మా అనుబంధ సంస్థలు, ఆఫీసర్‌లు, డైరెక్టర్లు లేదా ఉద్యోగులు నష్టం లేదా డ్యామేజీకి బాధ్యత వహించాల్సి వస్తే, అటువంటి ఏదైనా లయబిలిటీ, క్లెయిం తేదీకి ముందు నెలలో ఫ్లాట్‌ఫారం లేదా సేవల వినియోగానికికొరకు మాకు చెల్లించిన ఛార్జీలు లేదా మొత్తాలను మించకుండా పరిమితం చేయబడుతుంది.
#
నష్ట పరిహారంఏవిధంగానైనా ఉత్పన్నమయ్యే ఏదైనా క్లెయిం, ప్రొసీడింగ్, నష్టం, పాడైపోవడం, బాధ్యత, ఖర్చు, డిమాండ్ లేదా వ్యయం (అటార్నీ ఫీజులతో సహా అయితే దానికే పరిమితం కాకుండా) కొరకు మాకు, మరియు మా సబ్సిడరీలు, అఫిలియేట్‌లు మరియు ఏజెంట్‌లు మరియు వారి ప్రతి ఒక్కరి ఆఫీసర్‌లు, డైరెక్టర్‌లు, ఉద్యోగులు, వారసులు మరియు అసైనీలకు నష్టపరిహారం చెల్లించేందుకు, కాపాడేందుకు మరియు హాని కలగకుండా చూసేందుకు మీరు అంగీకరిస్తున్నారు: (i) ఫ్లాట్‌ఫారం మరియు సేవలకు మీ యాక్సెస్ లేదా ఉపయోగం; (ii) ఈ ఒప్పందం కింద మీ బాధ్యతల యొక్క ఏదైనా మీ ఉల్లంఘన; (iii) మేధోపరమైన ఆస్తి యొక్క ఏదైనా ఉల్లంఘన, లేదా ఏదైనా గోప్యత లేదా వినియోగదారుల సంరక్షణ హక్కుతో సహా ఏదైనా తృతీయపక్ష హక్కుల ఉల్లంఘన; (iv) చట్టం లేదా ఒప్పంద బాధ్యత ఏదైనా ఉల్లంఘన మరియు అటువంటి ఉల్లంఘనకు అనుగుణంగా ఏవైనా క్లెయింలు, డిమాండ్‌లు, నోటీసులు; (v) మీ నిర్లక్ష్యం లేదా అశ్రద్ధ.
ఈ ఒప్పందం రద్దు చేసేంత వరకు ఈ బాధ్యతలు మనుగడలో ఉంటాయి.
#
విన్నవించని మెటీరియల్మేం ఎప్పుడూ ఫీడ్‌బ్యాక్ లేదా ఇతర సూచనలను ప్రశంసిస్తాం. మేం వాటిని మీకు నష్టపరిహారం ఇవ్వడానికి ఎలాంటి పరిమితులు లేదా బాధ్యత లేకుండా ఉపయోగించవచ్చు మరియు వాటిని గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత ఉండదు.
#
సాధారణం- ఈ యాప్ యొక్క మునుపటి సంస్కరణలు ఒకవేళ ఇతర ప్రొవైడర్ల ద్వారా అందించబడిన అవి నిబంధనలతో కూడిన షరతుల ప్రకారం హక్కులు మరియు బాధ్యతలు మొహల్లా గ్రూప్‌కు కేటాయించబడ్డాయి.ఈ నిబంధనల్లోని వేటినైనా అమలు చేయలేకపోయితే, మిగిలినవి అమల్లో ఉంటాయి.
- మానిబంధనల్లో ఏవైనా సవరణ లేదా రద్దు చేయడం రాతపూర్వకంగా మరియు మా ద్వారా సంతకం చేయబడి ఉండాలి.
- చట్టాన్ని అమలు అధికారులకు ఏదైనా చట్టవ్యతిరేక లేదా అనుమతించని చర్యలను నివేదించడం లేదా మీ ప్రొఫైల్‌ని బ్లాక్ చేయడం లేదా సస్పెండ్ చేయడంతో సహా, ఈ నిబంధనల్లోని ఏదైనా అంశాన్ని అమలు చేయడంలో మేం విఫలమైనట్లయితే, మా హక్కులను అమలు చేయడంలో అటువంటి వైఫల్యం, మా ద్వారా వాటిని రద్దు చేసినట్లు కాదు.
- మీకు స్పష్టంగా మంజూరు చేయని అన్ని హక్కులను మేం కలిగి ఉంటాం.