Skip to main content

చీర్స్ పాలసీ

Last updated: 12th April 2022

ఈ చీర్స్ పాలసీ ("చీర్స్ పాలసీ") అనేది https://mojapp.in/ మరియు/లేదా Moj మొబైల్ అప్లికేషన్ (సమిష్టిగా, "ప్లాట్‌ఫార్మ్")లో ఉన్న మా వెబ్‌సైట్ చీర్స్ ఫీచర్ ("చీర్స్ ఫీచర్") యొక్క మీ వినియోగాన్ని నియంత్రిస్తుంది. మరియు Mohalla Tech Pvt. Ltd.(“షేర్‌‌చాట్”, “కంపెనీ”, “మేము”, “మా యొక్క” మరియు “మా”) దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.

భారతదేశంలో అమలులో ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం స్థాపించబడిన ఒక ప్రైవేట్ కంపెనీ మరియు No.2 26, 27 1వ ఫ్లోర్, సోనా టవర్స్‌, హోసూర్‌ రోడ్‌, కృష్ణ నగర్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా, బెంగళూరు, కర్ణాటక -560029 వద్ద ఆఫీస్‌ని రిజిస్టర్ చేయబడింది. ఇక్కడ "మీరు" మరియు "మీ యొక్క" అనే పదాలు ప్లాట్‌ఫార్మ్‌ని వినియోగించే యూజర్ అని అర్థం చేసుకోవాలి.

మా ప్లాట్‌ఫార్మ్ మీ ఫ్రెండ్స్‌తో మరింత సన్నిహితంగా గడపడానికి మీకు సహాయం చేస్తుంది మరియు మీరు ఎంచుకున్న ప్రాంతీయ భాషలో షార్ట్ వీడియోలను షేర్‌ చేసుకోవడానికి, చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మేము మీ కంటెంట్ అభిరుచులను అర్థం చేసుకున్నాం మరియు మా ప్లాట్‌ఫార్మ్ (సర్వీస్ / సర్వీస్‌లు ) లో అందుబాటులో ఉన్న కంటెంట్‌ని సూచించడానికి మీ న్యూస్‌ఫీడ్‌ని వ్యక్తిగతీకరిస్తాము.

చీర్స్ ఎలా పని చేస్తుంది?#

మీరు ఇప్పుడు మా యూజర్స్‌కి (“గిఫ్ట్స్”) వర్చువల్ గిఫ్ట్స్ /డిజిటల్ గూడ్స్ లాంటివి (స్టిక్కర్‌లు, gifలు, బ్యానర్‌లు మొదలైనవి) లైసెన్స్ చేయవచ్చు. మీరు మా ప్రామాణికమైన చెల్లింపు పద్ధతులను ఉపయోగించి చీర్స్ ("చీర్స్") పొందడం ద్వారా మరియు మేము అందుబాటులో ఉంచబడిన ప్రామాణికమైన చెల్లింపు సర్వీస్ ఇచ్చే వారి ద్వారా అలాంటి గిఫ్ట్స్‌లను పంపవచ్చు. చీర్స్/గిఫ్ట్స్‌ని క్యాష్ లేదా లీగల్ టెండర్‌గా మార్చబడవు అని గుర్తుంచుకోండి.

చీర్స్ కొనుగోలు#

 • చీర్స్ ధర చీర్స్‌ని కొనుగోలు చేసేటప్పుడు ప్రదర్శించబడుతుంది. చీర్స్ కోసం అన్ని ఛార్జ్‌లు మరియు చెల్లింపులను మేము నిర్ధేశించిన సంబంధిత చెల్లింపు విధానం ద్వారా కొనుగోలు చేసే సమయంలో పేర్కొన్న కరెన్సీలో ఉంచబడుతుంది.

 • మీరు కొనుగోలు చేసిన ఏ చీర్స్‌కైనా మీరే బాధ్యత వహించాలి. మీ చెల్లింపు పూర్తయిన తర్వాత, కొనుగోలు చేసిన చీర్స్ సంఖ్యతో మీ యూజర్ అకౌంట్‌కి జమ చేయబడుతుంది.

చీర్స్ యొక్క ఉపయోగం#

 • చీర్స్‌ని ఇతర యూజర్స్‌కి గిఫ్ట్స్‌గా పంపడానికి కూడా ఉపయోగించవచ్చు. చీర్స్‌ని క్యాష్, లేదా లీగల్ టెండర్ లేదా ఏదైనా రాష్ట్రం, ప్రాంతం లేదా ఏదైనా రాజకీయ సంస్థ లేదా మరేదైనా క్రెడిట్ రూపంలో మార్పిడి చేయబడదు.

 • చీర్స్‌ని మా ప్లాట్‌ఫార్మ్‌లో మరియు మా సర్వీస్‌లలో భాగంగా మాత్రమే ఉపయోగించాలి మరియు మేము నియమించినవి మినహా మరే ఇతర వాటితో కలిపి ఉపయోగించడం లేదా ప్రమోషన్‌లు, కూపన్‌లు, డిస్కౌంట్‌లు లేదా ప్రత్యేక ఆఫర్‌లలో కలిపి ఉపయోగించడం చేయకూడదు.

 • ప్లాట్‌ఫార్మ్ యొక్క ఇతర యూజర్‌కి లేదా ఏదైనా థ‌ర్డ్ పార్టీకి చీర్స్‌ని కేటాయించబడదు లేదా బదిలీ చేయబడదు. మా ద్వారా కాకుండా ఏదైనా చీర్స్‌ల అమ్మకం, వస్తు మార్పిడి, అసైన్‌మెంట్ లేదా ఇతర ఏ విధమైన బదిలీ పూర్తిగా నిషేధించబడింది. ఈ పరిమితిని ఏమైనా ఉల్లంఘిస్తే, ప్లాట్‌ఫార్మ్‌లో మీ అకౌంట్ రద్దు చేయబడవచ్చు, మీ అకౌంట్ నుండి చీర్స్‌ని జప్తు చేయవచ్చు మరియు/లేదా మీరు నష్టాలు, దావా మరియు లావాదేవీ ఖర్చులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

 • సంపాదించిన చీర్స్ అనేవి ప్రాపర్టీగా మార్చబడదు మరియు బదిలీ చేయబడవు:
  (a) మరణం తర్వాత;
  (బి) గృహ సంబంధాల విషయంలో భాగంగా; లేదా
  (సి) చట్టం ఆపరేషన్ ద్వారా గాని.

 • అటువంటి చీర్స్‌ని నిర్వహించడానికి, క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి, సవరించడానికి మరియు/లేదా తొలగించడానికి మాకు హక్కు ఉందని మీరు అంగీకరిస్తున్నారు, అలా మేము చేసేది మీరు ఈ చీర్స్ పాలసీని ఉల్లంఘించారని మేము విశ్వసించిన సంద‌ర్భంలో మాత్ర‌మే, ఇంకా చట్ట అతిక్రమణ చేసిన లేదా నియంత్రణ లేదా చట్టపరమైన భద్రత లేదా సాంకేతిక కారణాలను మీరు ఏ విధంగానైనా ఉల్లంఘన చేశారని మేము భావించినప్పుడు, మేము ఈ హక్కును వినియోగిస్తాము. దీనిపై మీకు ఎలాంటి బాధ్యత ఉండదు. మేము మా సర్వీస్‌ల నుండి చీర్స్‌ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించుకుంటే, మీకు వివరణతో కూడిన స్పష్టమైన నోటీస్‌ని అందించడం ద్వారా మేము తెలియజేస్తాము.

 • అనేక కారణాలచే చీర్స్ కొనుగోలను లేదా గిఫ్ట్స్ కోసం చీర్స్‌ని నెరవేర్చుటకు మీ సామర్థ్యానికి పరిమితులను సెట్ చేయ‌డం జరగవచ్చు. వయస్సు ధృవీకరణ, వినియోగదారు భద్రత, మోసం నివారణ, ప్రమాదాన్ని తగ్గించడం వంటివి కూడా ఆ కారణాలలో భాగం. మేము వీటిని మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము.

గిఫ్ట్స్ ఎలా పని చేస్తాయి?#

ప్లాట్‌ఫార్మ్‌లో అకౌంట్‌లో అందుబాటులో ఉన్న చీర్స్‌ని కాపాడుకోవడం ద్వారా మీరు గిఫ్ట్స్‌ని పొందుతారు. మీరు గిఫ్ట్స్‌ని ఇతర యూజర్స్‌కి పంపవచ్చు అలాగే ప్లాట్‌ఫార్మ్‌లో ఉన్న ఇతర యూజర్స్ నుంచి గిఫ్ట్స్‌ని స్వీకరించవచ్చు. మీరు పంపిన లేదా స్వీకరించిన గిఫ్ట్స్‌ని క్యాష్ లేదా లీగల్ టెండర్ రూపంలో మార్పిడి చేయబడదు అని గుర్తుంచుకోండి.

ఒక యూజర్ మరొక యూజర్‌కి గిఫ్ట్‌ని పంపినప్పుడు, అందుకున్న గిఫ్ట్ విలువ గ్రహీత అకౌంట్‌లో మింట్స్ ("మింట్స్") రూపంలో చూపబడుతుంది. మింట్స్‌ని చీర్స్‌గా మార్చడం సాధ్యం కాదు మరియు చీర్స్‌ని కూడా మింట్స్‌గా మార్చడం సాధ్యం కాదు . Moj తన విచక్షణ అధికారం ప్రకారం అటువంటి మింట్స్ విలువను మార్చుకునే హక్కును కలిగి ఉంది.

గిఫ్ట్స్‌ని కొనుగోలు చేయడం#

 • గిఫ్ట్స్ డిజిటల్ ప్రొడక్ట్స్ మరియు సర్వీస్‌ల యొక్క నిర్దిష్ట లక్షణాలకు పరిమిత లైసెన్స్‌ని కలిగి ఉంటాయి. చీర్స్ మరియు మింట్స్‌ల మధ్య మార్పిడి/విమోచన రేట్ మా ప్లాట్‌ఫార్మ్‌లో ప్రదర్శించబడుతుంది.

 • ప్రచురించబడిన ధరలు అనేవి మీ అధికార పరిధిలోని వర్తించే చట్టాల ప్రకారం అవసరమైన పన్నులను విధించబడతాయి.

 • ఏదైనా సాధారణ లేదా నిర్దిష్ట సందర్భంలో మా సొంత అభీష్టానుసారం నిర్ణయించే ఎక్స్చేంజ్ రేట్‌ని నిర్వహించడానికి, క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి, సవరించడానికి మరియు/లేదా తొలగించడానికి మాకు హక్కు ఉందని మీరు అంగీకరిస్తున్నారు మరియు మేము ఈ హక్కును వినియోగించుకోవడంపై మీకు ఎలాంటి బాధ్యత ఉండదు.

 • ఈ చీర్స్ పాలసీలో నిర్దేశించబడినవి మినహా, చీర్స్‌ని గిఫ్ట్స్‌గా మార్చడం/విమోచించడం చేసినవే చివరవి. మేము ఏ పద్ధతిలో కూడా రిఫండ్‌లు అందించడం లాంటివి చేయం.

 • గిఫ్ట్స్‌ని చీర్స్‌గా లేదా క్యాష్‌గా మార్చబడదు లేదా ఎక్స్చేంజ్ చేయబడదు లేదా ఏ కారణం చేతనైనా మేము రిఫండ్ చేయం లేదా తిరిగి చెల్లించడం చేయం.

 • ఏ యూజర్ ద్వారానైనా ఎక్స్చేంజ్ చేసిన లేదా స్వీకరించబడిన గిఫ్ట్స్‌ని ప్రాపర్టీగా మార్చబడదు మరియు బదిలీ చేయబడదు:
  (a) మరణం తర్వాత;
  (బి) గృహ సంబంధాల విషయంలో భాగంగా; లేదా
  (సి) చట్టం ఆపరేషన్ ద్వారా గాని.

 • యూజర్ ఎక్స్చేంజ్ చేసిన లేదా స్వీకరించిన గిఫ్ట్స్ పాడైపోయాయి అని లేదా దెబ్బతిన్నాయని మేము మా సొంత అభీష్టానుసారం గుర్తిస్తే, గతంలో ఎక్స్చేంజ్ చేసిన గిఫ్ట్స్ కాపీలను మేము భర్తీ చేయవచ్చు. పాడైన లేదా దెబ్బతిన్న గిఫ్ట్‌ని మళ్ళీ జారీ చేయడానికి మేము అదనపు రుసుములను వసూలు చేయము. మీరు పాడైపోయిన లేదా దెబ్బతిన్న గిఫ్ట్‌ని స్వీకరిస్తే, contact@sharechat.coలో మమ్మల్ని సంప్రదించండి.

 • మీరు చీర్స్ ఫీచర్‌ని దుర్వినియోగం చేసినా లేదా మీరు ఈ చీర్స్ పాలసీ నిబంధనలు ఉల్లంఘించిన, మీ ఫీచర్‌ని రద్దు చేసే హక్కు లేదా మీకు వ్యతిరేకంగా ఏదైనా ఇతర తగిన చర్య తీసుకునే హక్కు మాకు ఉంది.

 • ప్లాట్‌ఫార్మ్‌లో లేదా మరేదైనా యూజర్ నుండి ఏదైనా వస్తువులు లేదా సర్వీస్‌లు రసీదుకు బదులుగా ఏదైనా గిఫ్ట్ లేదా చీర్స్‌ని ఉపయోగించడానికి మీకు అనుమతి లేదు.

ఇన్ఫూలెన్స‌ర్ లేదా ఇతర యూజర్ రూపొందించిన కంటెంట్ కోసం మీరు గిఫ్ట్స్‌ని ఎలా ఉపయోగించవచ్చు#

 • యూజర్ లేదా ఇన్ఫూలెన్స‌ర్ రూపొందించిన కంటెంట్ (“క్రియేటర్”)కి సంబంధించి ప్రశంసలను అందించడానికి మీరు లైవ్‌స్ట్రీమ్‌లు లేదా క్రియేటర్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసిన ఐటమ్ లేదా కంటెంట్‌కి రేట్ చేయడానికి మీరు గిఫ్ట్స్‌ని ఉపయోగించవచ్చు. సర్వీస్‌లలో ఈ ఫంక్షనాలిటీ అందుబాటులో ఉంది మరియు "సెండ్" బటన్ క్లిక్ చేయడం ద్వారా క్రియేటర్స్‌కి గిఫ్ట్స్‌ని అందించవచ్చు.

 • మీరు క్రియేటర్‌కి పంపవలసిన గిఫ్ట్‌ని ఎంచుకొని "సెండ్" బటన్‌పై క్లిక్ చేసినప్పుడు ఈ గిఫ్ట్ క్రియేటర్ అకౌంట్‌కి పంప‌బ‌డుతుంది.

 • మీరు క్రియేటర్‌కి గిఫ్ట్‌ని ఇచ్చినప్పుడు, మీరు అది పబ్లిక్‌గా చేస్తారు అని దయచేసి గుర్తుంచుకోండి. అందువలన, ప్లాట్‌ఫార్మ్‌లోని ఇతర యూజర్స్ (గిఫ్ట్ గ్రహీతతో సహా) మీ పేరు మరియు గిఫ్ట్ వివరాలు చూడగలరు.

రిపోర్ట్ చేయ‌డం#

మీరు ఈ చీర్స్ పాలసీని ఎవరైనా ఉల్లంఘించినట్లు గమనిస్తే దయచేసి దాన్ని contact@sharechat.coకి రిపోర్ట్ చేయండి.

చీర్స్ పాలసీని ఉల్లంఘించినట్లు అనేక రిపోర్ట్‌లు వచ్చినట్లు అయితే, మాతో ఉన్న మీ అకౌంట్‌ని రద్దు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది మరియు మాతో రిజిస్టర్ చేయడానికి వీలు లేకుండా బ్లాక్ చేయవచ్చు. మీరు అలాంటి తొలగింపుపై అప్పీల్ చేయాలి అనుకుంటే మీరు contact@sharechat.co కి మీ మెసేజ్‌ని రాయవచ్చు.

ఉపయోగించని లేదా రీడీమ్ చేయని చీర్స్ లేదా గిఫ్ట్స్‌కి రిఫండ్‌లు చేయబడదు, కాబట్టి మీ అకౌంట్‌ని ముంగిచే ముందు వాటిని ఉపయోగించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాం.

యూజర్స్‌కి గమనిక#

 • మీ చీర్స్ కొనుగోలుపై మీకు టాక్స్ ఇన్‌వాయిస్ అవసరమైతే, దయచేసి మీ ఆర్డర్ ID రుజువు తెలియజేస్తూ contact@sharechat.coకి ఇమెయిల్ రాయండి మరియు మా టీమ్ మీరు రిక్వెస్ట్ చేసిన దాన్ని వీలైనంత త్వరగా జారీ చేస్తారు.

 • చీర్స్ / గిఫ్ట్స్ అనేవి యూజర్స్ కొనుగోలు చేసే వ్యక్తిగత వస్తువులుగా పరిగణించబడవు కానీ ప్లాట్‌ఫార్మ్‌చే జారీ చేయబడిన వస్తువులకు లైసెన్స్ పొందిన యాక్సెస్‌గా పరిగణనలోకి తీసుకోబడుతుంది.

 • ఇంటర్నెట్‌లో ట్రేడింగ్ కోసం చీర్స్ ఉపయోగించబడదు

 • ప్లాట్‌ఫార్మ్‌లో మీరు కొనుగోలు చేసే చీర్స్ / గిఫ్ట్స్‌కి మీరే బాధ్యత వహించాలి మరియు అటువంటి చీర్స్ / గిఫ్ట్స్‌కి సంబంధించి మాపై ఎలాంటి జవాబుదారీతనం లేదా బాధ్యత ఉండదని మీరు అంగీకరిస్తున్నారు.

 • ఏది నిబంధనలను ఉల్లంఘించేది ఏవి కాదు అనేది మా సొంత అభీష్టానుసారం నిర్ణయించే హక్కు మాకు ఉంది.

 • ఈ చీర్స్ పాలసీలోని భాగాలను ఎప్పుడైనా మార్చడానికి మా సొంత అభీష్టానుసారం నిర్ణయించే హక్కును కలిగి ఉన్నాం. మేము ఏవైనా విషయాలను మార్చితే, మేము ఈ పేజ్‌లో మార్పులను పోస్ట్ చేస్తాం మరియు ఈ నిబంధనలు చివరిగా అప్‌డేట్ చేసిన తేదీని ఈ పేజ్‌పై భాగంలో సూచిస్తాము.