Skip to main content

మోజ్ గోప్యతా విధానం

Last updated: 15th December 2023

మేము (మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్, లేదా "MTPL") మీ గోప్యత గురించి చాలా ఆందోళన చెందుతున్నాము మరియు మేము ఈ ఆందోళనను చాలా తీవ్రంగా పరిగణిస్తాము. ఈ గోప్యతా విధానం ("గోప్యతా విధానం") మీరు మా మొబైల్ అప్లికేషన్ మరియు దాని వెర్షన్‌లను ("యాప్") ఉపయోగించినప్పుడు మీ డేటాను మేము ఎలా సేకరిస్తాము, ప్రాసెస్ చేస్తాము, ఉపయోగిస్తాము మరియు బహిర్గతం చేయవచ్చు అనే విషయాలను తెలియజేస్తుంది. యాప్ "ఫ్లాట్‌ఫారం"గా పేర్కొనబడుతుంది. "మేం", "మా" లేదా "మమ్ములను" లేదా "కంపెనీ"కు సంబంధించిన రిఫరెన్స్‌లు అంటే ఫ్లాట్‌ఫారం మరియు/లేదా మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని అర్థం. "మీ", "మీ యొక్క" లేదా "యూజర్‌"కు సంబంధించిన ఏవైనా రిఫరెన్స్‌లు మాఫ్లాట్‌ఫారం ఉపయోగించే ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అని అర్థం. ఈ గోప్యతా విధానంలో వివరించినట్లుగా మినహాగా మీ సమాచారాన్ని మేం ఉపయోగించం లేదా ఎవరితోనైనా పంచుకోం.

ఈ గోప్యతా విధానం ఉపయోగ నిబంధనల ("నియమనిబంధనలు") యొక్క భాగం మరియు దానితోపాటుగా చదువుకోవాలి. ఈ ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించడం ద్వారా, ఈ గోప్యతా విధానం యొక్క నియమనిబంధనలకు మీరు అంగీకరిస్తున్నారు. ఈ గోప్యతా విధానంలో వివరించిన విధంగా మీ వ్యక్తిగత సమాచారాన్ని (దిగువ వివరించిన విధంగా)మేం ఉపయోగించేందుకు మరియు వెల్లడించేందుకు కూడా మీరు సమ్మతిస్తున్నారు. ఈ గోప్యతా విధానంలో పెద్ద అక్షరాలు ఉపయోగించి, ఇక్కడ నిర్వచించనట్లయితే, నిబంధనల్లో అటువంటి పదాలకు ఇవ్వబడ్డ అర్ధం ఉంటుంది. ఈ గోప్యతా విధానం యొక్క నియమనిబంధనలను మీరు అంగీకరించనట్లయితే, దయచేసి ఈ ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించవద్దు.

మేం సేకరించే సమాచారం మరియు మేం దానిని ఎలా ఉపయోగిస్తాం#

దిగువ టేబుల్ మీ నుంచి మేం సేకరించే సమాచారాన్ని మరియు దానిని మేం ఏవిధంగా ఉపయోగిస్తాం అనే విషయాలను జాబితా చేస్తుంది:

మేం సేకరించే సమాచారంమేం దానిని ఎలా ఉపయోగిస్తాం
లాగ్-ఇన్ డేటా: యూజర్ ఐడి, మొబైల్ ఫోన్ నెంబరు, ఇమెయిల్ ఐడి, లింగం (ఐచ్ఛికం), మరియు ఐపి చిరునామా. మా ఫ్లాట్‌ఫారం మరియు మా ఫ్లాట్‌ఫారం యొక్క నిర్ధిష్ట ఫీచర్‌లు (సమిష్టిగా "లాగ్-ఇన్ డేటా") యాక్సెస్ చేసుకోవడానికి మీరు సముచితమైన వయస్సు వారు అని మాకు తెలియజేసే సూచనాత్మక వయస్సు శ్రేణిని మేం సేకరించవచ్చు..

మీరు పంచుకునే కంటెంట్: దిగువ పేర్కొన్నవాటితో సహా, ప్లాట్‌ఫారం ద్వారా ఇతర యూజర్‌లకు మీరు అందించే మొత్తం సమాచారం కూడా దీనిలో ఉంటుంది:

- మీ గురించి లేదా ఏవైనా కోట్‌లు, ఇమేజ్‌లు, రాజకీయ అభిప్రాయాలు, మతపరమైన అభిప్రాయాలు, ప్రొఫైల్ చిత్రం, యూజర్ బయో మరియు హ్యాండిల్‌, ఇతర విషయాలతో సహా ఫ్లాట్‌ఫారంపై మీరు స్వచ్చందంగా పంచుకునేవాటికి సంబంధించిన సమాచారం.
- ప్లాట్‌ఫారంపై మీరు చేసే ఏవైనా పోస్ట్‌లు

ఇతర వనరుల నుంచి మేం అందుకునే సమాచారం మేం తృతీయపక్షాలతో సన్నిహితంగా పని చేయవచ్చు (ఉదాహరణకు, వ్యాపార భాగస్వాములు, సాంకేతిక, ఎనలిటిక్స్ ప్రొవైడర్‌లు, సెర్చ్ సమాచార ప్రొవైడర్‌లు) మరియు అటువంటి వనరుల నుండి మీ గురించి సమాచారాన్ని అందుకోవచ్చు. అటువంటి డేటా అంతర్గతంగా పంచుకోవచ్చు మరియు ఈ ఫ్లాట్‌పారంపై సేకరించిన డేటాను విలీనం చేయవచ్చు.

లాగ్ డేటా: "లాగ్ డేటా" అనేది మీరు ఫ్లాట్‌పారం ఉపయోగించేటప్పుడు కుకీలు, వెబ్ బీకాన్‌లు, లాగ్ ‌పైల్స్, స్క్రిప్ట్‌ల ఉపయోగం ద్వారా వీటితో సహా అయితే పరిమితం కాకుండా మేం ఆటోమేటిక్‌గా సేకరించే సమాచారం:
- మీ మొబైల్ క్యారియర్ సంబంధిత సమాచారం, మీ వెబ్‌బ్రౌజర్ ద్వారా అందించబడ్డ కాన్ఫిగరేషన్ సమాచారం లేదా ప్లాట్‌పారం యాక్సెస్ కొరకు మీరు ఉపయోగించే ఇతర ప్రోగ్రామ్‌లు, మీ ఐపి చిరునామా మరియు మీ పరికరం వెర్షన్ మరియు గుర్తింపు నెంబరు వంటి సాంకేతిక సమాచారం;
- ఫ్లాట్‌ఫారం ఉపయోగించేటప్పుడు మీరు దేని గురించి వెతికారు మరియు వీక్షించారనే దాని గురించి సమాచారం, ఉపయోగించిన వెబ్ సెర్చ్ పదాలు, సందర్శించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఉపయోగించిన మినీ అప్లికేషన్‌లు మరియు ఫ్లాట్‌ఫారాన్ని ఉపయోగించేటప్పుడు మీరు యాక్సెస్ చేసుకున్న లేదా అభ్యర్థించిన ఇతర సమాచారం మరియు కంటెంట్ వివరాలు;
- మీరు కమ్యూనికేట్ చేసిన యూజర్ గుర్తింపుతో మరియు సమయం, డేటా మరియు మీ కమ్యూనికేషన్‌ల కాలవ్యవధి వంటి ఫ్లాట్‌ఫారంపై కమ్యూనికేషన్‌ల గురించి సాధారణ సమాచారం; మరియు
- మెటాడేటా, అంటే అప్లికేషన్ ద్వారా మీరు లభ్యమయ్యేట్లుగా చేసిన ఐటమ్‌లకు సంబంధించి పంచుకున్న ఫోటోగ్రాఫ్ లేదా వీడియో తీసిన లేదా పోస్ట్ చేసిన తేదీ, సమయం లేదా లొకేషన్ వంటి సమాచారం అని అర్ధం..

కుకీలు: మా ప్లాట్‌ఫారం యొక్క ఇతర యూజర్‌ల నుండి మిమ్మల్ని వేరు చేయడానికి మా ప్లాట్‌ఫారం కుకీలను ఉపయోగిస్తుంది. మీరు మా ఫ్లాట్‌ఫారాన్ని బ్రౌజ్ చేసినప్పుడు మంచి యూజర్ అనుభవాన్ని మీకు అందించడానికి మరియు మేం ఫ్లాట్‌ఫారాన్ని మెరుగుపరచడానికి అనుమతించేందుకు ఇది మాకు సాయపడుతుంది. మీ పరికరంపై కుకీల నుంచి మేం కుకీ డేటాను సేకరిస్తాం. మేం ఉపయోగించే కుకీలు మరియు వాటిని ఏ ప్రయోజనాల కొరకు మేం ఉపయోగిస్తాం అనేదాని గురించి సవిస్తరమైన సమాచారం కొరకు, దయచేసి మా కుకీ పాలసీని చూడండి

సర్వేలు: మీరు ఒక సర్వేలో పాల్గొనేందుకు ఎంచుకున్నట్లయితే, నిర్ధిష్ట వ్యక్తిగత సమాచారం అంటే మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగించే ఏదైనా సమాచారాన్ని("వ్యక్తిగత సమాచారం") అందించమని మేం మిమ్మల్ని అభ్యర్ధించవచ్చు. ఈ సర్వేలు నిర్వహించడానికి మేం తృతీయపక్ష సర్వీస్‌ ప్రొవైడర్‌ని ఉపయోగించవచ్చు మరియు సర్వే పూర్తి చేయడానికి ముందు మేం మీకు దీనిని తెలియజేస్తాం.
- ఫ్లాట్‌ఫారంపై ఒక యూజర్ అకౌంట్‌ని సెటప్ చేయడం మరియు లాగిన్‌ని సులభతరం చేయడానికి;
- ఈ గోప్యతా విధానంతో సహా, ఫ్లాట్‌ఫారానికి మార్పుల గురించి మీకు నోటిఫై చేయడానికి;
- యూజర్ సపోర్ట్ అందించడంతో సహా, కమ్యూనికేషన్‌ని సులభతరం చేయడానికి;
- మీ నియమనిబంధనలు, మరియు పాలసీలు మరియు ఏవైనా మా హక్కులు, లేదా మా అఫిలియేట్ కంపెనీల లేదా ఫ్లాట్‌ఫారం యొక్క ఇతర యూజర్‌ల హక్కులను అమలు చేయడానికి;
- కొత్త సర్వీస్‌లు అభివృద్ధి చేయడానికి మరియు ప్రస్తుతం ఉన్న సర్వీస్‌లు మరియు ఫ్లాట్‌పారాన్ని మెరుగుపరచడానికి, యూజర్ ఫీడ్‌‌బ్యాక్ మరియు అభ్యర్ధనలను ఇంటిగ్రేట్ చేయడానికి;
- వ్యక్తిగతీకరణ ఆధారంగా భాష మరియు లొకేషన్‌ అందించడానికి;
-ట్రబుల్ షూటింగ్, డేటా విశ్లేషణ, టెస్టింగ్, పరిశోధన, భద్రత, మోసం- గుర్తించడం, అకౌంట్ మేనేజ్‌మెంట్, మరియు సర్వే ఉద్దేశ్యాలతో సహా సహా ఫ్లాట్ ఫారం మరియు అంతర్గత కార్యకలాపాల నిర్వహణ కొరకు;
- ఫ్లాట్‌ఫారాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు మరియు యాక్సెస్ చేసుకుంటున్నారనేది మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మరియు ఫ్లాట్‌ఫారంపై యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి;
- ఫ్లాట్‌ఫారాన్ని మా యూజర్‌లు ఎలా ఉపయోగిస్తున్నారని మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రాంతం, ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్లాట్‌ఫారం, సిస్టమ్ భాష, మరియు ఫ్లాట్‌పారం వెర్షన్ వంటి ఐటమ్‌లపై యూజర్ డెమోగ్రాపిక్ విశ్లేషణ నిర్వహించడానికి, వ్యక్తిగత సమాచారంతో సహా మీ సమాచారాన్ని మారుపేరుతో ప్రకటించడానికి మరియు సంగ్రహం చేయడానికి;
- ఫ్లాట్‌పారంపై యూజర్‌లు తృతీయపక్ష సేవలను యాక్సెస్ చేసుకునేటప్పుడు ఎటువంటి కంటెంట్ మరియు సేవల్ని ఉపయోగించారనే దానిపై వెబ్ మరియు అకౌంట్ ట్రాఫిక్ గణాంకాలను సేకరించడానికి, వ్యక్తిగత సమాచారంతో సహా మీ సమాచారాన్ని మారుపేరుతో ప్రకటించడానికి మరియు సంగ్రహం చేయడానికి;
- మేము లేదా గ్రూపు నిర్వహించే సంబంధిత / సోదరి ప్లాట్‌ఫారమ్‌లలో ప్రొఫైల్‌ల కాపీలను అప్‌లోడ్ చేయండి లేదా క్రియేట్ చేయడం;
- ప్రకటనలు మరియు ఇతర మార్కెటింగ్ మరియు ప్రచార కార్యకలాపాల సమర్థతను మదింపు చేయడానికి మరియు మెరుగుపరచడానికి.
యూజర్ శోధన డేటా: ఫ్లాట్‌ఫారంపై మీ ద్వారా నిర్వహించే ఏవైనా శోధనలు.మీ గత శోధనలకు త్వరగా యాక్సెస్ అందించడానికి. వ్యక్తిగతీకరణ కొరకు ఎనలిటిక్స్‌ని ఉపయోగించడానికి మరియు మీ లక్షిత ప్రకటనలు చూపించడానికి.
అదనపు అకౌంట్ భద్రత: మేం మీ ఫోన్ నెంబరును సేకరిస్తాం మరియు ఒక్కసారి పాస్‌వర్డ్ ("వోటిపి") మీకు పంపడం ద్వారా మీ ఫోన్‌పై ఎస్ఎమ్ఎస్‌కు యాక్సెస్‌ని అభ్యర్ధిస్తాం, మా ఫ్లాట్‌ఫారంపై రిజిస్టర్ చేసేటప్పుడు మీ గుర్తింపును ధృవీకరించడానికి వోటిపి నమోదు చేయడం ద్వారా మీరు ధృవీకరిస్తారు.మీ గుర్తింపును ధృవీకరించడానికి మరియు మీ అకౌంట్‌ భద్రతను నిర్వహించడానికి. జనరేట్ అయిన వోటిపిని ఆటోమేటిక్‌గా చదవడానికి మీ ఎస్ఎమ్ఎస్ ఫోల్డర్‌కు మేం యాక్సెస్‌ని అభ్యర్ధిస్తాం.
కాంటాక్ట్‌ల లిస్ట్: మీ మొబైల్ పరికరంపై కాంటాక్ట్‌ల లిస్ట్‌ని మేం యాక్సెస్ చేసుకుంటాం. మీ కాంటాక్ట్‌ల లిస్ట్‌ని యాక్సెస్ చేసుకోవడానికి ముందు ఎప్పుడూ మేం మీ సమ్మతిని కోరతాం మరియు మీ కాంటాక్ట్‌ల లిస్ట్‌కు మా యాక్సెస్‌ని నిరాకరించే ఆప్షన్ మీకు ఉంటుంది.సూచనలను అందించడానికి మరియు మీ స్నేహితులు మరియు ఇతర కాంటాక్ట్‌లను ఫ్లాట్‌ఫారానికి ఆహ్వానించడానికి మరియు ఎవరైనా వ్యక్తులు ఫ్లాట్‌ఫారంపై చేరినప్పుడు మీకు తెలియజేయడానికి.
లొకేషన్ సమాచారం: "లొకేషన్ డేటా" అనేది మీ జిపిఎస్, ఐపి చిరునామా, మరియు/లేదా లొకేషన్ సమాచారాన్ని కలిగి ఉండే పబ్లిక్ పోస్ట్‌ల నుంచి పొందిన సమాచారం.

మీరు ప్లాట్‌ఫారాన్ని యాక్సెస్ చేసినప్పుడు, మీకు సేవల్ని అందించడానికి లేదా మీ అకౌంట్‌పై బహుళ లాగిన్‌లు లేవని నిర్ధారించడం వంటి మా ఫ్లాట్‌ఫారాన్ని మెరుగుపరచడానికి మేం మీ ఐపి చిరునామా, పరికరం లేదా ఇంటర్నెట్ సర్వీస్ నుండి స్థాన సమాచారాన్ని పొందుతాం కనుక మీరు ఫ్లాట్‌ఫారాన్ని యాక్సెస్ చేసుకునేటప్పుడు మాతో మరియు ఇతర ఫ్లాట్‌ఫారం యూజర్‌లతో నిర్ధిష్ట లొకేషన్ సమాచారాన్ని మీరు వెల్లడిస్తారు.
- సెక్యూరిటీ, మోసం-గుర్తించడం మరియు అకౌంట్ మేనేజ్‌మెంట్ కొరకు;
- మెరుగైన కంటెంట్ టార్గెటింగ్ కొరకు ఉపయోగించడానికి;
- ఉపయోగించడానికి మీరు ఎంచుకునే లొకేషన్-ఆధారిత సేవల్ని మీకు అందించడానికి:
-నియతానుసారంగా ఫ్లాట్‌ఫారంపై లభ్యం కాగల మినీ అప్లికేషన్లు, అవి అందించే సర్వీస్‌ల ఆధారంగా అటువంటి సమాచారం అవసరం అవుతుంది (ఒకవేళ మీరు ఏదైనా మినీ అప్లికేషన్‌కు మీ లొకేషన్ వెల్లడించాలని మీరు ఎంచుకున్నట్లయితే);
- భాష మరియు లొకేషన్ కస్టమైజేషన్‌ని అందించడానికి.
కస్టమర్ సపోర్టు సమాచారం: నియతానుసారంగా మా ఫ్లాట్‌ఫారం ఉపయోగించడానికి మీకు అవసరం కాగల ఏదైనా సాయం లేదా సపోర్ట్‌కు సంబంధించి మా కస్టమర్ సపోర్ట్ టీమ్‌కు మీరు అందించే ఏదైనా సమాచారం.మీకు సపోర్ట్ మరియు సాయాన్ని అందించడానికి సాయపడటానికి
పరికరం డేటా: "పరికరం డేటా" దిగువ పేర్కొన్నవాటితో సహా అయితే వాటికే పరిమితం కాకుండా:

§ పరికరం లక్షణాలు: ఆపరేటింగ్ సిస్టమ్, ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ మరియు భాష, హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ వెర్షన్‌లు, పరికరం కంపెనీ మరియు మోడల్, స్క్రీన్ రిజల్యూషన్, బ్యాటరీ లెవల్, సిగ్నల్ సామర్థ్యం, పరికరం ర్యామ్, పరికరం బిట్ రేట్, లభ్యం అవుతున్న స్టోరేజీ స్థలం, పరికరం సిపియుకు సంబంధించిన సమాచారం, బ్రౌజర్ రకం, యాప్ మరియు ఫైల్ పేర్లు మరియు రకాలు మరియు ప్లగిన్‌లు వంటి సమాచారం.

§ పరికరం ఆపరేషన్‌‌లు: పరికరంపై నిర్వహించబడే ఆపరేషన్లు మరియు ప్రవర్తనల గురించి సమాచారం, ఉదాహరణకు, ఒక విండో ఫోర్‌గ్రౌండ్ చేయబడిందా లేదా బ్యాక్‌గ్రౌండ్ చేయబడిందా వంటి ప్రవర్తనలు.

§ ఐడెంటిఫైయర్‌లు: మీరు ఉపయోగించే గేమ్‌లు, యాప్‌లు లేదా అకౌంట్‌ల నుంచి ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లు, డివైస్ ఐడిలు, యాడ్ ఐడిలు మరియు ఇతర ఐడెంటిఫైయర్‌లు.

§ పరికరం సిగ్నల్స్: మేము మీ బ్లూటూత్ సిగ్నల్స్, మరియు దగ్గరల్లోని Wi-Fi యాక్సెస్ పాయింట్‌లు, బీకాన్‌లు మరియు సెల్ టవర్ల గురించి సమాచారాన్ని సేకరించవచ్చు.

§ పరికరం సెట్టింగ్‌ల నుంచి డేటా: మీరు ఆన్ చేసిన పరికరం సెట్టింగ్‌ల ద్వారా మేం పొందేందుకు మీరు అనుమతించే మీ జిపిఎస్ లొకేషన్, కెమెరా లేదా ఫోటో‌లకు యాక్సెస్ వంటి సమాచారం.

§ నెట్‌వర్క్ మరియు కనెక్షన్‌లు: మీ మొబైల్ ఆపరేటర్ లేదా ISP పేరు, నెట్‌వర్క్ రకం మరియు వేగం, డేటా వినియోగం, భాష, టైమ్‌జోన్, మొబైల్ ఫోన్ నెంబరు, ఐపి చిరునామా మరియు కనెక్షన్ స్పీడ్ వంటి సమాచారం.

§ అప్లికేషన్ మరియు అప్లికేషన్ వెర్షన్: మీ మొబైల్ పరికరంపై స్టోర్ చేసిన ఏవైనా మొబైల్ అప్లికేషన్‌లు.

§ మీడియా: మీ మొబైల్ పరికరంపై ఎలాంటి పరిమితులు లేకుండా , ఇమేజ్‌లు, వీడియోలు మరియు ఆడియో ఫైల్స్ మరియు మీ ఫోన్‌లోని స్టోరేజీ స్థలంతో సహా మీడియా గ్యాలరీని మేం యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే, మీ ఇమేజ్‌లను యాక్సెస్ చేసుకోవడానికి ముందు మేం ఎప్పుడూ మీ సమ్మతిని పొందుతాం మరియు మాకు అటువంటి యాక్సెస్‌ని నిరాకరించే ఆప్షన్ మీకు ఉంటుంది.

- ఫ్లాట్‌ఫారం ఉపయోగించి ఏవైనా వీడియోలు మరియు ఇమేజ్‌లను పంచుకోవడాన్ని సులభతరం చేయడానికి;
- మీ మొబైల్ పరికరానికి తగినవిధంగా మా ఫ్లాట్‌ఫారాన్ని కస్టమైజ్ చేయడానికి;
- కెమెరా కాన్ఫిగరేషన్‌ల ఉద్దేశ్యాల కొరకు;
- వాట్స్‌అప్ మరియు/లేదా ఫేస్‌బుక్ ద్వారా పంచుకునే ఉద్దేశ్యాల కొరకు ఫ్లాట్‌ఫారం నుంచి ఏదైనా కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి మీ పరికరంపై తగినంత స్టోరేజీ స్థలం ఉన్నదా అని అర్థం చేసుకోండి;
- మా ఫ్లాట్‌ఫారంపై మీ యూజర్ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేయడానికి;
- సముచితమైన యూజర్ వీడియో అనుభవాన్ని అందించడానికి;
- మా నియమనిబంధనలు మరియు పాలసీలను అమలు చేయడానికి మీ గుర్తింపును ధృవీకరించడానికి;
- ఫ్లాట్‌ఫారాన్ని మెరుగుపరచడానికి.
- లొకేషన్ ఫీడ్ ఉద్దేశ్యాల కొరకు ఉపయోగించడానికి;
- యూజర్ భాష/వ్యక్తిగతీకరణను పొందడానికి;
- మీ మొబైల్ పరికరంపై డౌన్‌లోడ్ చేసిన అప్లికేషన్‌ల ద్వారా ఫ్లాట్‌ఫారంపై ఏదైనా కంటెంట్‌ని పంచుకోవడాన్ని సులభతరం చేయడానికి;
- కెమెరా లెన్స్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి
ఫోన్ కాల్ లాగ్‌లు - OTP రిజిస్ట్రేషన్‌కు ప్రత్యామ్నాయంగా, మిస్సేడ్ కాల్ మెకానిజం ద్వారా మా వినియోగదారులు వారి ఫోన్ నంబర్‌ను ధృవీకరించడానికి వీలుగా యూజర్ యొక్క పరికరం నుండి కాల్ లాగ్స్ చదవడానికి అనుమతి అడుగుతాము. రిజిస్ట్రేషన్ ప్రయోజనాల కోసం OTP డెలివరీ ఆలస్యం అయినప్పుడు వినియోగదారులు ఈ విధానాన్ని ఎంచుకుంటారు.రిజిస్ట్రేషన్ ప్రయోజనాల కోసం
లెన్స్‌ల నాణ్యతను మెరుగుపరచడానికి మేం యాపిల్ ట్రూడెప్త్ కెమెరా నుంచి సమాచారాన్ని కూడా ఉపయోగించవచ్చు. ట్రూడెప్త్ కెమెరా నుంచి సమాచారం రియల్ టైమ్‌లో ఉపయోగించబడుతుంది మరియు ఈ సమాచారాన్ని మేం మా సర్వర్‌లపై నిల్వ చేయం. ఈ సమాచారం తృతీయపక్షాలతో పంచుకోబడదు

మీ సమాచారాన్ని వెల్లడించడం#

దిగువ పేర్కొన్న రీతిలో మేం మీ సమాచారాన్ని వెల్లడిస్తాం:

ఇతరులకు కనిపించే కంటెంట్#

పబ్లిక్ కంటెంట్ అంటే, మీ యూజర్ ప్రొఫైల్ లేదా మరో యూజర్ ప్రొఫైల్‌లో మీరు పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్, పోస్ట్ కామెంట్ వంటివి సెర్చ్ ఇంజిన్‌లతో సహా ప్రతి ఒక్కరు యాక్సెస్ చేసుకునేలా ఉంటుంది. మీ ప్రొఫైల్ పేజీ సమాచారంతో సహా ఫ్లాట్‌ఫారంపై పోస్ట్ చేయడానికి మీరు స్వచ్ఛందంగా వెల్లడించే ఏదైనా సమాచారం, ప్రతిఒక్కరికి యాక్సెస్ చేసుకునేందుకు లభ్యమవుతుంది. ప్లాట్‌ఫారంపై మీరు పబ్లిక్ చేయడానికి ఎంచుకున్న కంటెంట్‌ని మీరు సబ్మిట్ చేసినప్పుడు, పోస్ట్ చేసినప్పుడు లేదా పంచుకున్నప్పుడు, ఇతరులు దానిని తిరిగి పంచుకోవచ్చు. మీరు ఎవరితో పంచుకోవాలనేది పరిగణించాలి, ఎందుకంటే మా ఫ్లాట్‌ఫారంపై మీ కార్యకలాపాన్ని చూడగల వ్యక్తులు మీరు పంచుకున్న ఆడియెన్స్‌కు వెలుపల ఉండే వ్యక్తులతో సహా మా ఫ్లాట్‌ఫారంపైన మరియు వెలుపల ఇతరులతో దానిని పంచుకోవడాన్ని ఎంచుకోవచ్చు.

యూజర్‌లు మీ గురించి కంటెంట్ సృష్టించడానికి మరియు వారు ఎంచుకున్న ఆడియెన్స్‌తో పంచుకోవడానికి కూడా మా ప్లాట్‌ఫారాన్ని ఉపయోగించవచ్చు, ఉదాహరణకు, యూజర్‌లు మీ ఫోటో పోస్ట్ చేయడం లేదా ఏదైనా వారి పోస్ట్‌ల్లో మిమ్మల్ని ట్యాగ్ చేయడం వంటివి. ఏదైనా సోషల్ మీడియా సైట్ లేదా ఏదైనా ఇతర ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ఫ్లాట్‌ఫారంపై మొత్తం పబ్లిక్ కంటెంట్‌ని పంచుకునే హక్కు మాకు దఖలు పడి ఉంటుంది. ఈ గోప్యతా విధానంలో స్పష్టంగా పేర్కొనబడనట్లయితే మినహా, అనామధేయ ప్రాతిపదికన మినహా మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎన్నడూ తృతీయపక్షాలకు అద్దెకు ఇవ్వం లేదా విక్రయించం.

మీ గ్రూపు కంపెనీలతో పంచుకోవడం#

మీరు మాతో పంచుకునే సమాచారాన్ని, మీ వ్యక్తిగత సమాచారంతో సహా, మా గ్రూపులోని ఎవరితోనైనా మేము పంచుకోవచ్చు. "గ్రూపు" అనే పదం, మేం నియంత్రించే ఏదైనా సంస్థ, లేదా మా నియంత్రణలో ఉన్న ఏదైనా సంస్థ, లేదా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మా ఉమ్మడి నియంత్రణలో ఉన్న ఏదైనా సంస్థ అని అర్థం.

ఇతరులతో మీరు ఏమి పంచుకుంటారు#

మా ఫ్లాట్‌ఫారం ఉపయోగించి మీరు కంటెంట్ పంచుకునేటప్పుడు మరియు కమ్యూనికేట్ చేసేటప్పుడు, అటువంటి కంటెంట్‌ని ఎవరు చూడగలరు అని మీరు ఆడియెన్స్‌ని ఎంచుకుంటారు. ఉదాహరణకు, మీరు ఫేస్‌బుక్‌పై మా ఫ్లాట్‌ఫారం నుంచి ఏదైనా కంటెంట్‌ని పోస్ట్ చేసేటప్పుడు, పోస్ట్ కొరకు ఒక స్నేహితుడు, స్నేహితుల బృందం లేదా మీ అందరి స్నేహితులు వంటి ఆడియెన్స్‌ని మీరు ఎంచుకుంటారు. అదేవిధంగా, మా ఫ్లాట్‌ఫారంపై కంటెంట్ పంచుకోవడానికి మీ మొబైల్ పరికరంపై వాట్స్‌అప్ లేదా ఏదైనా ఇతర అప్లికేషన్‌ని మీరు ఉపయోగించేటప్పుడు, మీరు కంటెంట్‌ని ఎవరితో పంచుకోవాలనేది ఎంచుకుంటారు. మీరు వారితో పంచుకునే కంటెంట్‌ని ఆ వ్యక్తులు ఏవిధంగా ఉపయోగించే ( ఫ్లాట్‌ఫారంపై లభ్యమయ్యే వాట్స్‌అప్ లేదా ఫేస్‌బుక్ వంటి ఏవైనా పంచుకునే ఆప్షన్‌ల ద్వారా కంటెంట్‌ని పంచుకోవడానికి మీరు ఎంచుకున్న వారితో) రీతిని మేం నియంత్రించలేం మరియు బాధ్యత వహించం.

తృతీయపక్షాలతో పంచుకోవడం#

వీరితో సహా ఎంపిక చేసిన తృతీయపక్షాలతో మేం మీ సమాచారాన్ని (వ్యక్తిగత సమాచారంతో సహా) పంచుకోవచ్చు:

  • వ్యాపార భాగస్వాములు, సప్లయర్‌లు మరియు సబ్‌కాంట్రాక్టర్‌లు ("అఫిలియేట్‌లు"). మేం మీతో ఒప్పందం కుదుర్చుకున్న ఏదైనా ఒప్పంద పనితీరు కొరకు సర్వీస్ మరియు అఫిలియేట్‌ల స్వంత సర్వీస్‌లను అందించడం, అర్థం చేసుకోవడం మరియు మెరుగుపరచడంలో సాయపడేందుకు అఫిలియేట్‌లు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు.
  • మీకు మరియు ఇతరులకు సంబంధిత ప్రకటనలను ఎంచుకోవడానికి మరియు అందించడానికి డేటా అవసరమైన ప్రకటనదారులు మరియు ప్రకటనదారుల నెట్‌వర్క్‌లు. మేం మా ప్రకటనదారులకు గుర్తించదగిన వ్యక్తుల గురించి సమాచారాన్ని వెల్లడించం, అయితే మేం మా యూజర్‌ల గురించి గురించి సంగ్రహ సమాచారం వారికి అందించవచ్చు (ఉదాహరణకు, ఏదైనా రోజునాడు వారి ప్రకటనపై క్లిక్ చేసిన నిర్ధిష్ట వయస్సు గ్రూపులో నిర్దిష్ట సంఖ్యలో మహిళలు అయినా వారి ప్రకటనపై క్లిక్ చేసినట్లయితే, మేం వారికి సమాచారం అందించవచ్చు). వారు లక్ష్యం చేసుకోవాలని కోరుకుంటున్న ఆడియెన్స్‌ని చేరుకోవడానికి ప్రకటనదారులకు సాయపడేందుకు అటువంటి సంగ్రహ సమాచారాన్ని మేం కూడా ఉపయోగించవచ్చు.
  • ప్రభుత్వ సంస్థలు లేదా చట్టాన్ని అమలు చేసే సంస్థలు, ఏవైనా చట్టపరమైన బాధ్యత లేదా ఏదైనా ప్రభుత్వ అభ్యర్ధనను పాటించేందుకు; లేదా కంపెనీ, మా ఖాతాదారులు లేదా పబ్లిక్ ఆస్తి, లేదా భద్రతకు ఏదైనా హానిని నిరోధించడం లేదా హక్కులను సంరక్షించడం; లేదా ప్రజాభద్రత, మోసం, భద్రత లేదా సాంకేతిక సమస్యలను గుర్తించడం, నిరోధించడం లేదా మరోవిధంగా పరిష్కరించడానికి మీ వ్యక్తిగత డేటా లేదా సమాచారాన్ని పంచుకునేందుకు సహేతుకంగా అవసరం అని మాకు మంచి విశ్వాసం ఉన్నట్లయితే.

దిగువ పేర్కొన్న పరిస్థితుల్లో ఎంపిక చేసిన తృతీయపక్షాలకు మీ సమాచారాన్ని ( వ్యక్తిగత సమాచారంతో సహా) కూడా మేం వెల్లడించవచ్చు:

  • ఒకవేళ కంపెనీ లేదా గణనీయంగా దాని మొత్తం ఆస్థులను తృతీయపక్షం స్వాధీనం చేసుకున్నట్లయితే, అటువంటి పరిస్థితుల్లో తన ఖాతాదారుల గురించి తన వద్ద ఉన్న వ్యక్తిగత డేటా బదిలీ చేయబడే ఆస్తుల్లో ఒకటి. మీ సమాచారం బదిలీ చేసే లేదా వేరే గోప్యతా విధానానికి లోబడి ఉండేలా ఆస్తుల విలీనం, స్వాధీనం, దివాలా, పునర్వ్యవస్థీకరణ లేదా అమ్మకంలో మేం నిమగ్నం అయితే, మేం మీకు ముందస్తుగా తెలియజేస్తాం తద్వారా మీరు మీ ఖాతాను బదిలీ చేయడానికి ముందు తొలగించడం ద్వారా అటువంటి ఏదైనా కొత్త పాలసీని మీరు నిలిపివేయవచ్చు.

  • మా నిబంధనల మరియు/లేదా ఏదైనా ఇతర ఒప్పందాలను అమలు చేయడం లేదా వర్తింప చేయడానికి.

భద్రతా విధానాలు#

మా ద్వారా సేకరించిన సమాచారాన్ని సురక్షితం చేయడానికి మేం తగిన సాంకేతిక మరియు భద్రతా చర్యలు చేపట్టాం. మేం మీకు (లేదా మీరు ఎంచుకున్నట్లయితే) ఫ్లాట్‌ఫారాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అనుమతించే ఒక యూజర్‌ని మేం మీకు ఇచ్చినప్పుడు, ఈ వివరాలను గోప్యంగా ఉంచేందుకు మీరు బాధ్యత వహిస్తారు. మీ పాస్‌వర్డ్‌ని ఎవరితోనూ పంచుకోవద్దని మేం మిమ్మల్ని కోరతాం.

మీ వ్యక్తిగత సమాచారాన్ని మేం ఎక్కడ భద్రపరుస్తాం#

మేం అమెజాన్ వెబ్ సర్వీసెస్, ఇంక్ (410 టెర్రీ అవెన్యూ. నార్త్ సీటెల్, వాషింగ్టన్ 98109, యుఎస్ఎ‌లో ప్రధాన కార్యాలయం ఉంది) ద్వారా అందించబడే అమెజాన్ వెబ్‌ సర్వీసెస్ క్లౌడ్ ఫ్లాట్‌ఫారంపై మరియు గూగుల్ ఎల్‌ఎల్‌సి (1101 ఎస్ ఫ్లవర్ స్ట్రీట్, బర్‌బ్యంక్, క్యాలిఫోర్నియా 91502, యుఎస్ఎ‌లో ప్రధాన కార్యాలయం ఉంది)పై ఇండియా మరియు విదేశాల్లో ఉండే వారి సర్వర్‌లపై మీ డేటాను మేం భద్రపరుస్తాం. అమెజాన్ వెబ్ సర్వీస్‌లు మరియు గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫారాలు రెండూ కూడా సమాచారం పోవడం, దుర్వినియోగం మరియు మార్చకుండా సంరక్షించడానికి భద్రతా చర్యలు అమలు చేస్తున్నాయి, వీటికి సంబంధించిన వివరాలు https://aws.amazon.com/ మరియు https://cloud.google.com వద్ద లభ్యమవుతాయి. అమెజాన్ వెబ్ సర్వీస్‌లు మరియు గూగుల్ క్లౌడ్ ఫ్లాట్‌ఫారం ద్వారా స్వీకరించిన గోప్యతా విధానాలు https://aws.amazon.com/privacy/?nc1=f_pr మరియు https://policies.google.com/privacy వద్ద లభ్యమవుతాయి.

ఈ పాలసీకి మార్పులు#

కంపెనీ నియతానుసారంగా ఈ గోప్యతా విధానాన్ని అప్‌డేట్ చేయవచ్చు. ఈ గోప్యతా విధానానికి మేం ఎప్పుడైనా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న ముఖ్యమైన మార్పులు చేసినట్లయితే, ఈ లింక్ వద్ద అప్‌డేట్ చేసిన గోప్యతా విధానాన్ని మేం పోస్ట్ చేస్తాం.

అస్వీకారం#

దురదృష్టవశాత్తు, ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేయడం ఎల్లప్పుడూ పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. అయితే, మీ వ్యక్తిగత సమాచారాన్ని సంరక్షించడానికి సాధ్యమైనంత వరకు మేం అత్యుత్తమైనది చేయగలిగినప్పటికీ, ఫ్లాట్‌ఫారానికి ప్రసారం చేసిన మీ డేటా భద్రతకు మేం భరోసా ఇవ్వలేం; ఏ ప్రసారమైనా మీ స్వంత రిస్క్‌కు లోబడి ఉంటుంది. మేం మీ సమాచారాన్ని మేం అందుకున్న తరువాత, అనధీకృతంగా యాక్సెస్ చేసుకోవడాన్ని నిరోధించడానికి మేం మా అత్యుత్తమ సామర్థ్యాల మేరకు కఠినమైన ప్రక్రియలు మరియు భద్రతా ఫీచర్‌లను ఉపయోగిస్తాం.

మీ హక్కులు#

మీ యూజర్ అకౌంట్/ప్రొఫైల్ మరియు మీ అకౌంట్/ప్రొఫైల్ నుంచి ఎప్పుడైనా కంటెంట్ తొలగించవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. అయితే, మీ కార్యకలాపాలు మరియు అకౌంట్ చరిత్ర మా ఫ్లాట్‌ఫారంపై మాకు లభ్యం అవుతుంది.

మీరు లాగిన్ చేసి, మీ ప్రొఫైల్ పేజీని సందర్శించడం ద్వారా ఏ సమయంలోనైనా మీ అకౌంట్ నుంచి వ్యక్తిగత సమాచారాన్ని మీరు సరి చేయవచ్చు, సవరించవచ్చు, జోడించవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు. పైన పేర్కొన్నవిధంగా సందేశంలోని ఆదేశాలను పాటించడం ద్వారా మా నుంచి అవాంఛిత ఇ-మెయిల్ కమ్యూనికేషన్‌లు వద్దని మీరు ఎంచుకోవచ్చు. అయితే, మీ అకౌంట్‌ని డిలీట్ చేసేంత వరకు అన్ని సిస్టమ్ ఇమెయిల్‌ని అందుకోవడాన్ని మీరు కొనసాగిస్తారు.ప్లాట్‌ఫారమ్ నుండి మీ ఖాతాను తొలగించడం మరియు వినియోగదారు డేటాను తీసివేయడం కోసం, దయచేసి మీ యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి, 'ఖాతా తొలగింపు అభ్యర్థన'/'నా డేటాను తొలగించు' ఎంపికపై క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం, దయచేసి ఖాతా తొలగింపుపై తరచుగా అడిగే ప్రశ్నలను చూడండి.

డేటా ఉంచడం#

మీ సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని (ఈ పేరాగ్రాఫ్‌లో నిర్వచించినట్లుగా) చట్టబద్ధంగా ఉపయోగించబడే ప్రయోజనాల కొరకు అవసరమైన దాని కంటే ఎక్కువ కాలం మేం నిలిపి ఉంచం. ఏదైనా ఇతర కంటెంట్ కొరకు, డిలీట్ చేయడం కొరకు మీ అభ్యర్ధనను మేం స్వీకరిస్తాం, అయితే, ఫ్లాట్‌ఫారం క్యాచేడ్ మరియు ఆర్కైవ్ చేసిన పేజీలతో సహా ఏదైనా పబ్లిక్ కంటెంట్ కాపీలు నిరవధికంగా మా సిస్టమ్‌ల్లో ఉంటాయి లేదా ఇతర యూజర్‌లు ఆ సమాచారాన్ని కాపీ చేసినా లేదా సేవ్ చేసినా కూడా మా సిస్టమ్‌ల్లో నిరవధికంగా ఉంటాయి. దీనికి అదనంగా, ఇంటర్నెట్ స్వభావం కారణంగా, మీ ఖాతా నుంచి తొలగించిన లేదా డిలీట్ చేసిన కంటెంట్‌తో సహా, మీ కంటెంట్ కాపీలు, ఇంటర్నెట్‌పై మరెక్కడైనా కూడా ఉండవచ్చు మరియు నిరవధికంగా ఉంచబడతాయి. "సున్నితమైన వ్యక్తిగత సమాచారం" అనగా పాస్‌వర్డ్‌లు మరియు నిబంధనల యొక్క 3 వ నిబంధన కింద సున్నితమైనదని వర్గీకరించబడిన ఏదైనా ఇతర సమాచారం అని అర్థం.

తృతీయపక్ష లింక్‌లు#

ప్లాట్ ఫారమ్ నియతానుసారంగా, మా భాగస్వామి నెట్‌వర్క్‌లు, ప్రకటనదారులు, అఫిలియేట్‌లు మరియు/లేదా ఏదైనా ఇతర వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ అప్లికేషన్‌ల వెబ్‌సైట్‌లకు మరియు నుంచి లింక్‌లను కలిగి ఉండవచ్చు. మీరు ఈ వెబ్‌సైట్‌ల ఏవైనా లింక్‌లను అనుసరించినట్లయితే, ఈ వెబ్‌సైట్‌లకు వాటి స్వంత గోప్యతా విధానాలు ఉంటాయని మరియు ఈ పాలసీల కొరకు ఏదైనా బాధ్యత లేదా లయబిలిటీని మేం స్వీకరించం అనే విషయాన్ని దయచేసి గమనించండి. ఈ వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ అప్లికేషన్‌లకు ఏదైనా వ్యక్తిగత డేటాను మీరు సబ్మిట్ చేయడానికి దయచేసి ఈ పాలసీలను చెక్ చేయండి.

మ్యూజిక్ లేబుల్స్#

యాప్ షార్ట్-వీడియో ప్లాట్‌ఫారమ్ కావడం వల్ల, ప్లాట్‌ఫారమ్‌లో సరైన వినియోగదారు అనుభవాన్ని నిర్ధారించడానికి మేము వివిధ మ్యూజిక్ లేబుల్‌లతో మ్యూజిక్ లైసెన్స్ ఒప్పందాలను కుదుర్చుకున్నాము. మ్యూజిక్ డేటాకు సంబంధించిన సమాచారం అనామధేయ రూపంలో నియతానుసారంగా అటువంటి మ్యూజిక్ లేబుల్స్‌తో పంచుకోవచ్చు.

థర్డ్‌-పార్టీ ఎంబెడ్‌లు మరియు సర్వీస్‌లు#

థర్డ్‌-పార్టీ ఎంబెడ్‌లు మరియు సర్వీస్‌లు అంటే ఏమిటి?#

దయచేసి గుర్తు పెట్టుకోండి, ప్లాట్‌ఫార్మ్‌లో ప్రదర్శించబడిన కంటెంట్‌లో కొంత భాగం ప్లాట్‌ఫార్మ్ ద్వారా హోస్ట్ చేయబడదు. ఈ "ఎంబెడ్‌లు" థర్డ్‌-పార్టీచే హోస్ట్ చేయబడతాయి మరియు ప్లాట్‌ఫార్మ్‌లో వాటిని ఎంబెడ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు: YouTube లేదా Vimeo వీడియోలు, Imgur లేదా Giphy gifలు, SoundCloud ఆడియో ఫైల్‌లు, Twitter ట్వీట్‌లు లేదా ప్లాట్‌ఫార్మ్‌లోని పోస్ట్‌లలో కనిపించే Scribd డాక్యూమెంట్స్ లాంటివి. మీరు నేరుగా ఆ సైట్‌లను విజిట్ చేసినట్లుగానే ఈ ఫైల్‌లు అనేవి హోస్ట్ చేసిన సైట్‌కి డేటాని పంపిస్తాయి (ఉదాహ‌ర‌ణ‌కు, మీరు YouTube వీడియోతో ఎంబెడ్‌లు కలిగిన ప్లాట్‌ఫార్మ్ పోస్ట్ పేజ్‌ని లోడ్‌ చేసినప్పుడు, YouTube మీ యాక్టివిటీకి సంభందించిన డేటాని రిసీవ్‌ చేసుకుంటుంది).

ప్లాట్‌ఫార్మ్‌లో నిర్దిష్ట ఫీచర్‌లను మీకు అందించడానికి స్వతంత్రంగా డేటాని సేకరించే థర్డ్‌-పార్టీ సర్వీస్‌లతో కూడా మేము భాగస్వామ్యం అవుతాం. మీరు ప్లాట్‌ఫార్మ్‌లో వాటిని యాక్సెస్ చేసినప్పుడు మీకు ఈ థర్డ్‌-పార్టీ సర్వీస్‌ల వినియోగ నిబంధనలను తెలియజేయబడవచ్చు. ఉదాహరణకు, Snap Inc. యాప్‌లో లెన్స్ వంటి నిర్దిష్ట ఫీచర్‌ల వినియోగాన్ని సులభతరం చేయడానికి మీ ముఖం నుండి చిత్రాలను సేకరించి నిల్వ చేయవచ్చు మరియు వాటి నిబంధనలు మరియు షరతుల గురించి మీకు తెలియజేస్తుంది (https://snap.com/enలో అందుబాటులో ఉంది -US/privacy/privacy-policy మరియు https://snap.com/en-US/terms) అటువంటి సేకరణకు ముందు.

ప్రైవసీని ప్రభావితం చేసే థర్డ్‌-పార్టీ ఎంబెడ్‌లు మరియు సర్వీస్‌లు#

థర్డ్‌-పార్టీ ఏ డేటాని సేకరిస్తుందో లేదా ఆ డేటాని వారు ఏ విధంగా వినియోగిస్తారు అనే విషయంపై ప్లాట్‌ఫార్మ్ నియంత్రించలేదు. కాబట్టి ప్లాట్‌ఫార్మ్‌లోని థర్డ్‌-పార్టీ ఎంబెడ్‌లు మరియు సర్వీస్‌లు ఈ ప్రైవసీ పాలసీ విధానం పరిధిలోకి రావు. అవి థర్డ్‌-పార్టీ సర్వీస్‌ల ప్రైవసీ పాలసీ విధానాలచే కవర్ చేయ‌బ‌డ‌తాయి. అటువంటి పొందుపరిచిన లేదా API సేవలను ఉపయోగించడం ద్వారా, మీరు మూడవ పక్షం యొక్క సేవా నిబంధనలకు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు.

తృతీయపక్ష ఎంబెడ్‌లతో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం#

కొన్ని ఎంబెడ్‌లు ఒక ఫారం ద్వారా మీ ఇమెయిల్ చిరునామా వంటి వ్యక్తిగత సమాచారాన్ని మిమ్మల్ని అడగవచ్చు. చెడ్డశక్తులను ఫ్లాట్‌ఫారం నుంచి దూరంగా ఉంచడానికి మేం అత్యుత్తమంగా చేయగలిగింది చేస్తాం. పైన వివరించినట్లుగా, వారి చర్యలు ఈ గోప్యతా విధానం ద్వారా కవర్ చేయబడవు. అందువల్ల, ఫ్లాట్‌ఫారంపై మీ ఇమెయిల్ చిరునామా లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత సమాచారం అడిగే ఎంబెడ్ ఫారాలను మీరు చూసినట్లయితే దయచేసి జాగ్రత్త వహించండి. మీ సమాచారాన్ని ఎవరికి సబ్మిట్ చేస్తున్నారు మరియు మరియు వారు దానిని ఏమిచేయాలని ప్లాన్ చేస్తున్నారనేది అర్ధం చేసుకున్నట్లుగా ధృవీకరించుకోండి. ఎంబెడెడ్ ఫారం ద్వారా ఏదైనా తృతీయపక్షానికి వ్యక్తిగత సమాచారాన్ని సబ్మిట్ చేయరాదని మేం సిఫారసు చేస్తున్నాం.

థర్డ్-పార్టీ ఎంబెడ్‌లు మరియు API సేవల వినియోగానికి వర్తించే థర్డ్-పార్టీ పాలసీల జాబితా:#

ప్లాట్‌ఫామ్ లో ఉపయోగించబడుతున్న ప్రస్తుత థర్డ్-పార్టీ API సేవల యొక్క పూర్తికాని జాబితా కోసం దయచేసి క్రింద చూడండి:

  • YouTube API సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్న విధానాల ద్వారా నిర్వహించబడతాయి: https://www.youtube.com/t/terms
  • Snap Inc. సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్న సేవా నిబంధనల ద్వారా నిర్వహించబడతాయి: https://snap.com/en-US/terms

విధానాలు వర్తించే విషయంలో ఏదైనా విభేదం లేదా అస్థిరత ఏర్పడినప్పుడు, అటువంటి థర్డ్ పార్టీ సేవా నిబంధనలు థర్డ్-పార్టీ ఉత్పత్తి/సేవల వినియోగాన్ని నియంత్రిస్తాయి మరియు MTPL ప్లాట్‌ఫామ్ విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్న కంటెంట్‌ను మరియు MTPL ప్లాట్‌ఫామ్ అందించే సేవలు నియంత్రిస్తాయి.

మీ స్వంత తృతీయపక్ష ఎంబెడ్ సృష్టించడం#

యూజర్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సబ్మిట్ చేయడానికి అనుమతించే ఒక ఫారాన్ని మీరు ఎంబెడ్ చేసినట్లయితే, సేకరించిన ఏదైనా సమాచారాన్న ఎలా ఉపయోగించాలని మీరు భావిస్తున్నది స్పష్టంగా పేర్కొంటూ ఎంబెడెడ్ ఫారానికి పక్కన వర్తించే గోప్యతా విధానం యొక్క శాశ్వత లింక్‌ని మీరు విధిగా అందించాలి. ఆ విధంగా చేయడంలో విఫలమైనట్లయితే, కంపెనీ పోస్ట్‌ని నిలిపివేయవచ్చు లేదా మీ ఖాతాను పరిమితం చేయడానికి లేదా నిలిపివేయడానికి ఇతర చర్యలు తీసుకోవచ్చు.

మా నుంచి కమ్యూనికేషన్#

సేవా సంబంధిత ప్రకటనలు పంపాల్సిన అవసరం ఉందని మేం భావించినప్పుడు నియతానుసారంగా మీకు పంపుతాం (మెయింటెనెన్స్ కొరకు మేం ఫ్లాట్‌ఫారాన్ని మేం ఎప్పుడు తాత్కాలికంగా నిలిపివేస్తాం, లేదా భద్రత, గోప్యత, లేదా అడ్మినిస్ట్రేటివ్ సంబంధిత కమ్యూనికేషన్‌లు వంటివి). మేం వీటిని ఎస్ఎమ్ఎస్ ద్వారా మీకు పంపుతాం. ఈ సేవా సంబంధిత ప్రకటనలను మీరు నిలిపివేయకపోవచ్చు, ఇవి ప్రమోషనల్ స్వభావాన్ని కలిగి ఉండవు మరియు మీ ఖాతాను సంరక్షించడానికి మరియు ప్లాట్‌ఫారంలో ముఖ్యమైన మార్పుల గురించి మీకు సమాచారం అందించడానికి మాత్రమే ఉపయోగించబడతాయి.

గ్రీవియెన్స్ (క్లేశ నివృత్తి) ఆఫీసర్#

డేటా భద్రత, గోప్యత మరియు ఫ్లాట్‌ఫారం వినియోగ ఆందోళనలకు సంబంధించి మీ ఆందోళనలను పరిష్కరించడానికి గ్రీవియెన్స్ ఆఫీసర్ ఉన్నారు. మీ ద్వారా లేవనెత్తబడ్డ ఆందోళనలను వాటిని అందుకున్నప్పటి నుంచి 15 (పదిహేను) రోజుల్లో పరిష్కరిస్తాం.
దిగువ పేర్కొన్న దేని ద్వారానైనా మీరు గ్రీవియెన్స్ ఆఫీసర్ Ms. Harleen Sethi సంప్రదించవచ్చు:
చిరునామా: మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్,
నార్త్ టవర్ స్మార్టువర్క్స్, వైష్ణవి టెక్ పార్క్,
సర్వే నెం 16/1 & నెం 17/2 అంబలిపురా విలేజ్, వార్తుర్ హొబ్లీ,
బెంగళూరు అర్బన్, కర్ణాటక – 560103
ఇమెయిల్: grievance@sharechat.co
గమనిక - దయచేసి వినియోగదారుని సంబంధిత అన్ని ఫిర్యాదులను పైన పేర్కొన్న ఇమెయిల్ ఐడికి పంపండి, ప్రాసెస్ చేయడానికి మరియు వాటిని పరిష్కరించడానికి.

నోడల్ కాంటాక్ట్ పర్సన్ - మిస్ హర్లీన్ సేథి
ఇమెయిల్: nodalofficer@sharechat.co
గమనిక - ఈ ఇమెయిల్ కేవలం పోలీసులు మరియు దర్యాప్తు సంస్థల ఉపయోగం కోసం మాత్రమే. వినియోగదారు సంబంధిత సమస్యలకు ఇది సరైన ఇమెయిల్ ID కాదు. వినియోగదారుకు సంబంధించిన అన్ని ఫిర్యాదుల కోసం, దయచేసి grievance@sharechat.co వద్ద మమ్మల్ని సంప్రదించండి