Skip to main content

మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ నియమనిబంధనలు

Last updated: 12th March 2021

మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ("మేం", "ఎంటిపిఎల్", "మా") ద్వారా అందించబడే మోజ్ రీఫరల్ ప్రోగ్రామ్ ("ప్రోగ్రామ్") అనేది మీ స్నేహితులు, సహోద్యోగులు మరియు కుటుంబసభ్యులు ("రిఫర్డ్," "పాల్గొనేవారు") మోజ్ ("ఫ్లాట్‌ఫారం")లో చేరడానికి మీరు రిఫర్ లేదా సిఫారసు చేసినందుకు మీకు మీ ("మీరు," "రీఫరర్,") రివార్డు ఇవ్వడం కొరకు సృష్టించబడింది.

ఈ కార్యక్రమ నియమనిబంధనలు ("నిబంధనలు") మీరు మరియు ఎంటిపిఎల్ మధ్య ఒక కట్టుబడి ఉండే ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి మరియు ప్రోగ్రామ్‌ అందించే ఏవైనా లేదా అన్నింటిలో మీరు పాల్గొనడాన్ని పరిపాలిస్తుంది. కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, మీరు ఫ్లాట్‌ఫారం నియమనిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని అంగీకరిస్తున్నారు. ఈ నియమనిబంధనలను మీరు పూర్తిగా అంగీకరించకపోయినట్లయితే, మీరు కార్యక్రమంలో పాల్గొనేందుకు అధికారం ఇవ్వబడదు. ఎంటిపిఎల్ తన పూర్తి విచక్షణమేరకు, ప్రోగ్రామ్ లేదా ప్రోగ్రామ్ యొక్క ఏదైనా అంశాన్ని ఎలాంటి ముందస్తు నోటీస్ లేకుండా మార్చడం, రద్దు చేయడం, సస్పెండ్ చేయడం లేదా సవరించే హక్కును కలిగి ఉంటుంది. ఎవరైనా యూజర్‌ని లేదా సంభావ్య యూజర్‌ని ఏ సమయంలో ప్రోగ్రామ్‌లో పాల్గొనకుండా అనర్హులను చేసే హక్కు కూడా ఎంటిపిఎల్ కు దఖలు పడి ఉంటుంది.

అర్హత:#

  • కార్యక్రమంలో పాల్గొనందుకు అర్హత కలిగి ఉండేందుకు రీఫరర్ ఇద్దరూ కూడా విధిగా ఫ్లాట్‌ఫారం యొక్క రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి.
  • ఫ్లాట్‌ఫారం నుంచి ఇన్ యాప్ బ్యానర్ ద్వారా కమ్యూనికేషన్ అందుకునే ఫ్లాట్‌ఫారం రిజిస్టర్డ్ యూజర్‌లకు మాత్రమే ప్రోగ్రామ్‌లో పాల్గొనడం లభ్యం అవుతుంది.

అర్హత కలిగిన రీఫరల్:#

"అర్హత కలిగిన రీఫరల్" అంటే దిగువ పేర్కొన్న అన్ని నిబంధనలను నెరవేర్చేవారు:

  • రిఫర్ చేసిన వారు రీఫరర్ ద్వారా పంచుకోబడ్డ రీఫరల్ లింక్ ఉపయోగించి ఫ్లాట్‌ఫారంలో చేరారు.
  • ఒకవేళ రిఫర్ చేసిన వారు ఏదైనా ఇతర విధానం ఉపయోగించి ఫ్లాట్‌ఫారంలో చేరినట్లయితే, రిజిస్ట్రేషన్ అర్హత కలిగిన రీఫరల్‌గా లెక్కించబడదు మరియు రీఫరర్ ఏవైనా రివార్డుల కొరకు అర్హత కలిగి ఉండరు.
  • రిఫర్ చేయబడ్డ వ్యక్తి ఇంతకు ముందు ఫ్లాట్‌ఫారం యొక్క యూజర్ వలే రిజిస్టర్ అయ్యారు;
  • ప్రతి రిఫర్ చేసిన వారికి కేవలం ఒక అర్హత కలిగిన రీఫరల్‌గా, ప్రతి రీఫరర్‌కు గరిష్టంగా 10 అర్హత కలిగిన రీఫరల్స్‌ని సంపాదించవచ్చు. ఎవరైనా అదనపు లేదా తదుపరి రిఫర్ చేయబడ్డ వారు అర్హత కలిగిన రీఫరల్స్‌గా పరిగణించబడదు, అందువల్ల రివార్డులను పొందడానికి అర్హత ఉండదు.

రివార్డ్‌లు:#

  • రీఫరర్ లింక్ ఉపయోగించి ఫ్లాట్‌ఫారంలో రిఫర్ చేసిన వారు చేరినప్పుడు ప్రతి అర్హత కలిగిన రీఫరల్‌కు రీఫరర్ రూ. __ ( భారతీయ రూపాయలు) __ ("రివార్డ్") వరకు రివార్డు పొందడానికి అర్హత కలిగి ఉంటాడు. నిబంధనలకు అనుగుణంగా మరియు సమ్మతి లోబడి రీఫరర్‌కు రివార్డ్ ఇవ్వబడుతుంది. ఫ్లాట్‌ఫారంపై రీఫరర్ ద్వారా పంచుకోబడ్డ బ్యాంక్ అకౌంట్‌కు రివార్డు క్రెడిట్ చేయబడుతుంది.

  • రివార్డులు ధృవీకరణకు లోబడి ఉంటాయి. ఎంటిపిఎల్ పరివోధన ఉద్దేశ్యం కొరకు రివార్డును ఆలస్యం చేయవచ్చు. ఎంటిపిఎల్ తన యొక్క పూర్తి విచక్షణ మేరకు మోసపూరిత, అనుమానాస్పదం, ఈ నిబంధనలను ఉల్లంఘించే లేదా ఎంటిపిఎల్ దాని సబ్సిడరీలు, అఫిలియేట్‌లు లేదా వారి సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ప్రతినిధులు మరియు ఏజెంట్లపై సంభావ్య బాధ్యతను విధిస్తుందని విశ్వసించినట్లయితే, ఏదైనా లావాదేవీని వెరిఫై చేయడానికి మరియు ప్రాసెస్ చేయడానికి కూడా నిరాకరించవచ్చు. అర్హత కలిగిన రీఫరల్ లేదా రివార్డ్ వెరిఫై చేయబడిందా అనే నిర్ణయాలతో సహా ఎంటిపిఎల్ యొక్క అన్ని నిర్ణయాలు అంతిమం మరియు వాటికి కట్టుబడి ఉండాలి.

డేటా గోప్యత:#

  • ప్రోగ్రామ్ సమయంలో ప్రోగ్రామ్ నిర్వహణ మరియు రీఫరర్ గుర్తింపు ధృవీకరించడానికి మరియు రీఫరర్‌కు రివార్డులను క్రెడిట్ చేయడానికి పేరు, మెయిలింగ్ చిరునామా, బ్యాంకు ఖాతా మరియు/లేదా డెబిట్/క్రెడిట్ కార్డు మరియు/లేదా పేటిఎమ్ వివరాలు, ఫోన్ నెంబరు, మరియు ఇమెయిల్ చిరునామా (ఒకవేళ వర్తించినట్లయితే) (సమిష్టిగా, "యూజర్ డేటా")తో సహా అయితే వాటికే పరిమితం కాకుండా ప్రోగ్రామ్ సమయంలో ఇవ్వబడ్డ సమాచారాన్ని ఎంటిపిఎల్ సేకరించవచ్చు, భద్రపరచవచ్చు, పంచుకోవచ్చు మరియు మరోవిధంగా ఉపయోగించేందుకు రీఫరర్ అంగీకరిస్తున్నారు.
  • రీఫరర్‌కు రివార్డును ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఎంటిపిఎల్ యూజర్ డేటాను తన బ్యాంకింగ్ బాగస్వామితో పంచుకోవచ్చు ఇక్కడ వివరించిన విధంగా మినహా, ఎంటిపిఎల్ యూజర్ డేటా వినియోగం Privacy Policy వద్ద ఉన్న గోప్యతా విధానానికి అనుగుణంగా ఉంటుంది.

లయబిలిటీ:#

కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా, రీఫరర్ వీటిని అంగీకరిస్తున్నాడు:

  • ఈ నిబంధనలు, ఎంటిపిఎల్ యొక్క నిర్ణయాలు, మరియు ఎంటిపిఎల్ యొక్క గోప్యతా విధానానికి కట్టుబడి ఉండటం;
  • ప్రోగ్రామ్‌లో రీఫరర్ పాల్గొనడానికి సంబంధించి ఉత్పన్నమయ్యే ఏవైనా మరియు అన్ని క్లెయింలు, చర్యలు, డిమాండ్‌లు, నష్టాలు, అప్పులు, ఖర్చులు లేదా వ్యయాలు(ఎలాంటి పరిమితులు లేకుండా,ఎవరైనా వ్యక్తి(లు) మరియు/లేదా ప్రోగ్రామ్ లేదా ఏదైనా రివార్డు బహుకరించడం, అందుకోవడం మరియు /లేదా ఉపయోగించడం లేదా దుర్వినియోగం సహా) ఎంటిపిఎల్, వారి సంబంధిత సంబంధిత ఉద్యోగులు, డైరెక్టర్లు, అధికారులు, లైసెన్సీలు, లైసెన్సర్‌లు, వాటాదారులు, అటార్నీలు మరియు ఏజెంట్లతో సహా,అయితే వారికే పరిమితి కాకుండా, వారి సంబంధిత ప్రకటనలు మరియు ప్రమోషన్ సంస్థలు మరియు ప్రోగ్రామ్ ఉత్పత్తి, ఆపరేషన్ లేదా పరిపాలనతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి లేదా సంస్థ (సమిష్టిగా, "రిలీజ్డ్ పార్టీలు") కాపాడుకోవడం, నష్టపరిహారం, విడుదల మరియు ఎంటిపిఎల్ హానిచేయకుండా ఉండటం, మరియు
  • లాభాలు, గుడ్‌విల్, వినియోగం, డేటా లేదా దిగువ పేర్కొన్నవాటి ఫలితంగా కలిగే ఇతర చరనష్టాలతె (అటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉందని ఎంటిపిఎల్ కు సలహా ఇవ్వబడినప్పటికీ) సహా అయితే వాటికే పరిమితం కాకుండా ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష, ఘటనాత్మక, ప్రత్యేక, ప్రభావిత, లేదా అసాధారణ నష్టాలకు ఎంటిపిఎల్ మీకు బాధ్యత వహించదు: (i) ప్రోగ్రామ్ ఉపయోగించడం లేదా ఉపయోగించలేకపోవడం; (ii) మీ ప్రసారాలు లేదా డేటాకు అనధీకృత ప్రాప్యత లేదా మార్పులు చేయడం; (iv) ప్రోగ్రామ్‌పై లేదా దాని ద్వారా ఏదైనా తృతీయపక్షం యొక్క ప్రకటనలు లేదా ప్రవర్తన; లేదా (v) ప్రోగ్రామ్‌కు సంబంధించిన ఏదైనా ఇతర విషయం.
  • ఏదైనా ప్రోగ్రామ్ ఉపయోగించడం అనేది వారి స్వంత రిస్క్.

మోసపూరిత మరియు అనుమానాస్పద ప్రవర్తన:#

  • అటువంటి రీఫరర్ మోసం చేయడం, హ్యాకింగ్, వంచించడం, హానికరమైన కార్యకలాపాలు లేదా నిష్పాక్షికంగా ఆడేవిధానాలు లేదా ఫ్లాట్‌ఫారం నియమనిబంధనలు Terms and Conditions ఉల్లంఘించడం లేదా ఏదైనా ఇతర రివార్డులను అందించడం ద్వారా ఎంటిపిఎల్ తన ఏకైక విచక్షణతో ఎంటిపిఎల్, దాని సబ్సిడరీలు, అనుబంధ సంస్థలు లేదా వారి సంబంధిత అధికారులు, డైరెక్టర్లు, ఉద్యోగులు, ప్రతినిధులు మరియు ఏజెంట్లపై సంభావ్య బాధ్యతను విధిస్తుందని ఎంటిపిఎల్ విశ్వసించినట్లయితే. ఎంటిపిఎల్ తన పూర్తి విచక్షణ మేరకు, కార్యక్రమంలో పాల్గొనడం లేదా రివార్డులను అందుకోవడం నుంచి రీఫరర్‌ని ఎంటిపిఎల్ నిషేధించవచ్చు.
  • రీఫరర్‌లు అనేక లేదా ఫేక్ ఇమెయిల్స్ చిరునామాలు లేదా ఖాతాలతో ప్రవేశించలేరు, అలానే కల్పిత గుర్తింపులను ఉపయోగించకపోవచ్చు లేదా ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి లేదా రివార్డ్ అందుకోవడానికి ఏదైనా సిస్టమ్, బాట్ లేదా ఇతర పరికరం లేదా ఆర్టిఫైస్‌ని ఉపయోగించలేరు.
  • రీఫరర్ ఎంట్రీ ప్రక్రియ లేదా ప్రోగ్రామ్ లేదా ఫ్లాట్‌ఫారం ఆపరేషన్‌ని ట్యాంపర్ చేయడం లేదా ఈ నిబంధనలను ఏ విధంగానైనా ఉల్లంఘించినట్లుగా ఎంటిపిఎల్ కనుగొన్నట్లయితే, ఎవరైనా రీఫరర్ మరియు/లేదా ఏవైనా రివార్డ్(లు)ను అనర్హులుగా చేసే హక్కు ఎంటిపిఎల్ కు ఉంది.

పరిపాలక చట్టం#

ఈ కార్యకక్రమం భారతీయ చట్టాలకు అనుగుణంగా పరిపాలించబడుతుంది.